5 పరుగులకే 3 వికెట్లు..కష్టాల్లో టీమిండియా

టీమిండియాకు కివీస్ బౌలర్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.   240 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలి ఓవర్‌‌లో కేవలం రెండు పరుగులు సాధించగా, రికార్డు సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న భారత్ ఓపెనర్  రోహిత్ శర్మ (1) తీవ్ర నిరాశ పరిచాడు. రెండో ఓవర్‌లో మ్యాట్ హెన్నీ అద్భుత స్వింగ్‌‌కు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే […]

5 పరుగులకే 3 వికెట్లు..కష్టాల్లో టీమిండియా
Follow us

|

Updated on: Jul 10, 2019 | 5:05 PM

టీమిండియాకు కివీస్ బౌలర్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.   240 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలి ఓవర్‌‌లో కేవలం రెండు పరుగులు సాధించగా, రికార్డు సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న భారత్ ఓపెనర్  రోహిత్ శర్మ (1) తీవ్ర నిరాశ పరిచాడు. రెండో ఓవర్‌లో మ్యాట్ హెన్నీ అద్భుత స్వింగ్‌‌కు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే పరుగు చేసి ఎల్బీ రూపంలో అవుట్ అయ్యాడు. అటు కేఎల్ రాహుల్ కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బౌల్ట్‌కు ఒకటి, హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి. కాగా వర్షం ప్రభావం వల్లనే టీమిండియా కుప్పకూలిందని స్పోర్ట్స్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.