వరల్డ్‌కప్ సెమీస్: భారత్ టార్గెట్ 240

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నేటికి వాయిదా పడగా.. కివీస్ 23 బంతుల్లో మరో మూడు వికెట్లు కోల్పోయి 28 పరుగులు జోడించింది. దీంతో భారత్‌కు 240 పరుగుల టార్గెట్‌ను విధించింది కివీస్. భారత్ బౌలర్లలో భువి 3 వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా, చాహల్, పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో రాస్ […]

వరల్డ్‌కప్ సెమీస్: భారత్ టార్గెట్ 240
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 10, 2019 | 3:37 PM

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నేటికి వాయిదా పడగా.. కివీస్ 23 బంతుల్లో మరో మూడు వికెట్లు కోల్పోయి 28 పరుగులు జోడించింది. దీంతో భారత్‌కు 240 పరుగుల టార్గెట్‌ను విధించింది కివీస్. భారత్ బౌలర్లలో భువి 3 వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా, చాహల్, పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో రాస్ టేలర్(74), విలియమ్సన్(67) మాత్రమే రాణించారు. ఇది ఇలా ఉండగా మంగ‌ళ‌వారం కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవ‌ర్ల వ‌ద్ద వ‌ర్షం కార‌ణంగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో ఓ సెమీఫైన‌ల్ మ్యాచ్ రిజ‌ర్వ్‌డే రోజున ఆడ‌డం ఇదే మొద‌టిసారి.