మరో వివాదంలో క్రికెటర్ షమీ… అపరిచిత మహిళకు మెసేజ్!
ముంబై: కొద్దిరోజులుగా తరచూ ఏదో ఒక వార్తతో మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు భారత్ పేసర్ మహ్మద్ షమీ. గతంలో అతడి భార్య హసీనా.. షమీ స్త్రీ లోలుడని, చాలామందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం అవ్వగా.. షమీ మాత్రం మంచివాడిగా బయటపడ్డాడు. అయితే ఇప్పుడు మరోసారి షమీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షమీ తనతో చాటింగ్ చేశాడని సోఫియా అనే మహిళ తాజాగా ఆరోపించింది. […]
ముంబై: కొద్దిరోజులుగా తరచూ ఏదో ఒక వార్తతో మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు భారత్ పేసర్ మహ్మద్ షమీ. గతంలో అతడి భార్య హసీనా.. షమీ స్త్రీ లోలుడని, చాలామందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం అవ్వగా.. షమీ మాత్రం మంచివాడిగా బయటపడ్డాడు. అయితే ఇప్పుడు మరోసారి షమీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
షమీ తనతో చాటింగ్ చేశాడని సోఫియా అనే మహిళ తాజాగా ఆరోపించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు షమీ మెసేజ్ చేయగా.. దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. ‘1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసేజ్ చేస్తున్నాడో చెప్పగలరా.? అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొంతమంది అభిమానులు ఆమెపై తీవ్రంగా మండిపడుతుంటే.. మరికొందరు షమీపై జోక్స్ వేస్తున్నారు. చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో.?
Shami’s feeling lonely in UK. ?? pic.twitter.com/WwXHSt5Gy7
— Dh (@_xLNc) July 8, 2019