IND vs NZ: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే ఫైట్‌.. 13 నుంచి టికెట్ల విక్రయం..

ఈనెల 18న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వన్డే ఫైట్‌ జరగనుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్‌ టికెట్లు ఈనెల 13 నుంచి విక్రయించనున్నారు. అయితే, టికెట్లపై ఈసారి మెలిక పెట్టింది హెచ్‌సీఏ.

IND vs NZ: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే ఫైట్‌.. 13 నుంచి టికెట్ల విక్రయం..
Ind Vs Nz 1st Odi Uppal
Follow us

|

Updated on: Jan 12, 2023 | 7:24 AM

హైదరాబాద్‌ ఉప్పల్ క్రికెట్‌ స్టేడియం మరో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఈనెల 18న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వన్డే ఫైట్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను ఈనెల 13 నుంచి 4 రోజులపాటు విక్రయించబోతున్నారు. అయితే, గత చేదు అనుభవం దృష్ట్యా టికెట్లన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే అమ్మబోతున్నారు. స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 39వేల 112 కాగా, కాంప్లిమెంటరీ కింద 9వేల 695 టికెట్స్‌ వెళ్లిపోనున్నాయి. మిగతా 29వేల 417 టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈసారి, ఆఫ్‌లైన్‌లో టికెట్‌ విక్రయాలు ఉండబోవని తేల్చిచెప్పింది హెచ్‌సీఏ.

గతం నేర్పిన గుణపాఠం.. ఈసారి మ్యాచ్‌కు నో ఆఫ్‌లైన్‌ టికెట్స్‌..

13, 14, 15, 16 తేదీల్లో నాలుగు విడతలుగా టికెట్లను అమ్మనున్నారు. ఒక్కొక్కరికి నాలుగు టికెట్లు ఇవ్వనున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్నా, తర్వాత ఫిజికల్‌ టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్‌ టికెట్‌ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామంటోంది హెచ్‌సీఏ. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో ఫిజికల్‌ టికెట్స్‌ను కలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. బ్లాక్‌ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకే హెచ్‌సీ ఈ చర్యలు తీసుకున్నామంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..