AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఎలా ఉండబోతోంది? ఆకాశ్ చోప్రా చెప్పిన 11 మంది వీరే

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేకు టీమిండియా తుది జట్టుపై ఆసక్తి పెరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలు ఖరారైనట్లు ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఆకిబ్ నబీ స్థానంలో మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని తెలిపాడు. వెల్లింగ్టన్ మ్యాచ్‌కు అతడు సూచించిన భారత ప్లేయింగ్ 11 వివరాలు ఇవే.

IND vs NZ: రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఎలా ఉండబోతోంది? ఆకాశ్ చోప్రా చెప్పిన 11 మంది వీరే
Roko
Rakesh
|

Updated on: Nov 06, 2026 | 2:24 PM

Share

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ఈ క్రమంలో నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో జరగనున్న రెండో వన్డేకు భారత తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో ఆడిన ఆకిబ్ నబీ దార్ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మొహమ్మద్ సిరాజ్ అందుబాటులోకి రావడంతో అతడి రీఎంట్రీపై అంచనాలు పెరిగాయి.

గిల్ సేనలో మార్పులు ఇవే

మాజీ భారత క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో రెండో వన్డే ప్లేయింగ్ 11పై విశ్లేషణ చేశాడు. అతడి అంచనా ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా జట్టులో కొనసాగనున్నారు. అలాగే నమన ధీర్, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్‌లకు మరో అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేసే అవసరం లేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

సిరాజ్ వస్తాడా? కుల్దీప్‌కు ఛాన్స్ దక్కుతుందా?

రెండో వన్డేలో భారత్ ఒక మార్పు చేసే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్‌లో ఆకిబ్ నబీ ఆరు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చినా వికెట్ తీయలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని విశ్లేషించాడు. సిరాజ్ అందుబాటులోకి రావడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోవాలా? లేక స్పిన్ బౌలింగ్‌ను బలోపేతం చేసేందుకు కుల్దీప్‌ను ఆడించాలా? అన్నది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

నాలుగు పేసర్లతో ఆడుతుందా?

ఒకవేళ ఆకిబ్ నబీ స్థానంలో సిరాజ్ వస్తే భారత జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, అన్‌శుల్ కంబోజ్, సిరాజ్ రూపంలో నలుగురు పేసర్లు ఉంటారు. అయితే కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇవ్వాలంటే బౌలింగ్ కూర్పులో మరో మార్పు అవసరమవుతుంది. అన్‌శుల్ కంబోజ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం వల్ల తొమ్మిదో స్థానంలో కుల్దీప్‌ను ఆడించే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా వివరించాడు. గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయడంతో అతడిని తప్పించడం కూడా అంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు.

ఆకాశ్ చోప్రా అంచనా వేసిన టీమిండియా ప్లేయింగ్ 11

ఆకాశ్ చోప్రా విశ్లేషణ ప్రకారం భారత జట్టులో దాదాపు పది స్థానాలు ఖరారైనట్లే కనిపిస్తున్నాయి. ఒక్క బౌలింగ్ స్థానంలో మాత్రమే సిరాజ్, కుల్దీప్ మధ్య పోటీ ఉంది. అతడి అంచనా వేసిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన ధీర్, అన్‌శుల్ కంబోజ్, మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఎలా ఉండబోతోంది?
రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఎలా ఉండబోతోంది?
రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? పూర్తి లెక్కలివే!
రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? పూర్తి లెక్కలివే!
నేరుగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
నేరుగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఏపీ పురపాలికల్లో ఒక వార్డ్ గెలుచుకున్న కాంగ్రెస్
ఏపీ పురపాలికల్లో ఒక వార్డ్ గెలుచుకున్న కాంగ్రెస్
1 గ్రామ్, 2 గ్రాముల గోల్డ్ కొంటున్నారా..? బిల్లులో ఇది చూడకపోతే..
1 గ్రామ్, 2 గ్రాముల గోల్డ్ కొంటున్నారా..? బిల్లులో ఇది చూడకపోతే..
ధంతేరస్ రోజున యమదీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న..
ధంతేరస్ రోజున యమదీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న..
రాత్రి పూట ఇంటి ముందు కనిపించిన భారీ కర్ర వంటి ఆకారం
రాత్రి పూట ఇంటి ముందు కనిపించిన భారీ కర్ర వంటి ఆకారం
ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..
ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..
పాపం ఓటు వేసేందుకు వెళ్తుంది ఆమె.. ఇలా జరుగుద్ది అనుకోలేదు..
పాపం ఓటు వేసేందుకు వెళ్తుంది ఆమె.. ఇలా జరుగుద్ది అనుకోలేదు..
విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే వంతెన.. ఈ రూట్లోనే.
విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే వంతెన.. ఈ రూట్లోనే.