AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘నేను సెలక్టర్‌గా ఉంటే.. విరాట్‌ని ఎంపిక చేసేవాడినే కాదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన జడేజా..

విరాట్ కోహ్లీ సుమారు ఐదు నెలల తర్వాత టీమ్ ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అందరి దృష్టి అతనిపై మాత్రమే ఉంది. అయితే కోహ్లీ రెండో టీ20లో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు.

Virat Kohli: 'నేను సెలక్టర్‌గా ఉంటే.. విరాట్‌ని ఎంపిక చేసేవాడినే కాదు'.. సంచలన వ్యాఖ్యలు చేసిన జడేజా..
Virat Kohli Bad Form
Venkata Chari
|

Updated on: Jul 10, 2022 | 4:12 PM

Share

India Vs England T20 Series: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాడ్ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. మ్యాచ్‌ల వారీగా పరుగులు సాధించడంలో అతను చాలా కష్టపడుతున్నాడు. విరాట్ గత పది ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే 40+ పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ దిగ్గజాలు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తర్వాత తాజాగా అజయ్ జడేజా కూడా విరాట్ కోహ్లీపై విరుచుకుపడ్డాడు. ఓ టీవీ ప్రోగ్రామ్‌లో జడేజా మాట్లాడుతూ.. నేను టీమిండియా సెలక్టర్‌గా ఉంటే టీ20 జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేసేవాడిని కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జడేజాకు ముందు 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ, పేలవమైన ఆటతీరుతో అశ్విన్‌ను జట్టు నుంచి తప్పించగలిగినప్పుడు.. విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించలేరంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు సునీల్ గవాస్కర్ కోహ్లీపై విమర్శలు చేశారు.

శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టీ20లో కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అతను అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లీష్ బౌలర్ రిచర్డ్ గ్లీసెన్ బౌలింగ్‌లో వైడ్ లాంగ్ ఆన్-డీప్ మిడ్ వికెట్ మధ్యలో డేవిడ్ మలన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

ఇవి కూడా చదవండి

5 నెలల తర్వాత టీ20ల్లో రీ ఎంట్రీ..

విరాట్ కోహ్లీ సుమారు ఐదు నెలల తర్వాత టీమ్ ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అందరి దృష్టి అతనిపై మాత్రమే ఉంది. అయితే కోహ్లీ రెండో టీ20లో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. కోహ్లీ పెవిలియన్ చేరిన వెంటనే అభిమానులు నిరాశకు గురయ్యారు.

మూడేళ్లుగా కోహ్లీ బ్యాట్ సైలెంట్..

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. మూడేళ్ల క్రితం వరకు భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా భావించిన కోహ్లీ బ్యాట్‌తో పరుగులు చేయడం లేదు. చివరి పది ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం ఒక ఫిఫ్టీ మాత్రమే కొట్టగలిగాడు. అతను రెండుసార్లు మాత్రమే 40+ స్కోర్ చేయగలిగాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా అత్యధికంగా 46 పరుగులు చేశాడు.

అనంతరం ఇంగ్లండ్‌ జట్టు 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ 35 పరుగులు చేశాడు. భారత్ తరపున భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..