AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొరకాయ అంటే ఇష్టంలేదా? ఇలా దోశలు వేసి చూడండి.. పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారు!

Bottle Gourd Dosa: సొరకాయ తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఈ కరకరలాడే సొరకాయ దోశలను ఎంతో ఇష్టంగా తింటారు. బియ్యప్పిండి, బొంబాయి రవ్వతో సులభంగా తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని స్టెప్ బై స్టెప్‌గా తెలుసుకోండి.

సొరకాయ అంటే ఇష్టంలేదా? ఇలా దోశలు వేసి చూడండి.. పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారు!
Bottle Gourd Dosa
Rajashekher G
|

Updated on: Aug 08, 2026 | 6:00 AM

Share

Crispy Bottle Gourd Dosa Recipe Telugu: సొరకాయ పేరు వినగానే చాలామంది ముక్కు ముడుస్తారు. “ఇంకేదైనా కూర చేస్తే బాగుండేది” అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలైతే సొరకాయ తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ, అదే సొరకాయతో బయట కరకరలాడే, లోపల మెత్తగా ఉండే రుచికరమైన దోశలు చేస్తే.. అందులో సొరకాయ ఉందని చెప్పినా నమ్మరు. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేయమని అడగడం ఖాయం. సొరకాయలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని అందించడంలోనూ సహాయపడుతుంది. అందుకే ఈ దోశలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పొచ్చు. ఉదయం అల్పాహారానికి, పిల్లల లంచ్‌బాక్స్‌కు లేదా సాయంత్రం టీతో పాటు స్నాక్‌గా కూడా ఇవి చక్కని ఎంపిక.

కావలసిన పదార్థాలు

  • లేత సొరకాయ – 1
  • బియ్యప్పిండి – 1 కప్పు
  • బొంబాయి రవ్వ – అర కప్పు
  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి – 2
  • కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర – 1 టీస్పూన్
  • ఉప్పు – తగినంత
  • నీరు – సుమారు 2 గ్లాసులు
  • నూనె – అవసరమైనంత

తయారీ విధానం

ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.

ఈ పేస్ట్‌లో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. తర్వాత నీరు పోసి రవ్వ దోశ పిండిలా పల్చగా తయారు చేసుకోవాలి. పిండి పల్చగా ఉంటే దోశలు మరింత కరకరలాడుతూ వస్తాయి.

ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. వేడెక్కిన పెనంపై పిండిని పల్చగా వేసి, చుట్టూ కొద్దిగా నూనె వేసి మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

అంతే… బయట కరకరలాడే, లోపల మెత్తగా ఉండే టేస్టీ సొరకాయ దోశలు సిద్ధం. వీటిని కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా టమాటా పచ్చడితో తింటే రుచి మరింత పెరుగుతుంది. సొరకాయ తిననని చెప్పే పిల్లలు కూడా ఈ దోశలను ఇష్టంగా తింటారు. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరినీ సర్‌ప్రైజ్ చేయండి.

Follow Us
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?