ఆగస్టు 8 రాశిఫలాలు: వారికి అదృష్టం, ఉద్యోగ పదోన్నతి..మీ రాశికి ఎలా ఉందంటే?
Horoscope Today (August 8, 2026): శనివారంనాడు 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ప్రభావం చూపనుంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య, ప్రయాణాలు వంటి అంశాల్లో మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశి వారికి ఈరోజు ఏమి సూచిస్తున్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (ఆగస్టు 8, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారులకు ఎక్కువగా ఉపయోగపడతారు. మిథున రాశి వారు జీతభత్యాల విషయంలో ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవా ర్తలు వింటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారులకు ఎక్కువగా ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో కొద్దిగా అపార్థాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
జీతభత్యాల విషయంలో ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపో తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్ట మైన ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆస్తి వివాదం సమసిపోతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు సామా న్యంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. రావలసిన డబ్బును, మొండి బాకీలను గట్టి పట్టుదలతో వసూలు చేసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరి ష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు పరవాలే దనిపిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సమ స్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ విషయంలో కీలక నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నం విషయంలో శుభవార్త అందుతుంది. వ్యాపా రాల పరిస్థితి లాభాలపరంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు అభి వృద్ధి బాటపడతాయి. మిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రావలసిన సొమ్ముతో పాటు మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆస్తి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. ఆదాయం పెరిగి, కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగాల్లో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. రావ లసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆదాయం పరవాలేదు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అత్యవసర ప్రయత్నాలు నెరవేరు తాయి. బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరో గ్యం ఇబ్బంది పెట్టవచ్చు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలతో పాటు శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఇతరుల వివాదాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పునకు అవకాశ ముంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. చదువుల్లో విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.



