Team India: అడిలైడ్‌లో అదరగొట్టిన భారత్.. విరాట్ విశ్వరూపం, ధోనీ మార్క్‌ ఫినిషింగ్‌తో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

India vs Australia: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు 6 సంవత్సరాల క్రితం జనవరి 26న ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించింది.

Team India: అడిలైడ్‌లో అదరగొట్టిన భారత్.. విరాట్ విశ్వరూపం, ధోనీ మార్క్‌ ఫినిషింగ్‌తో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
India Vs Australia 2016 T20 Jan 26th
Follow us
Venkata Chari

|

Updated on: Jan 26, 2022 | 9:24 AM

Team India In Republic Day: ఏ జట్టు అయినా తమ దేశంతో అనుబంధానమైన ప్రత్యేక సందర్భాలలో విజయం సాధించాలని కోరుకుంటుంది. భారత క్రికెట్ జట్టు(Team India) కూడా దేశానికి సంబంధించిన ప్రత్యేక తేదీన అడిలైడ్‌(India vs Australia)లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఆరేళ్ల క్రితం జనవరి 26న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) కీలక పాత్ర పోషించాడు. తుఫాను ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. అది 2016వ సంవత్సరం. అడిలైడ్, ఓవల్ గ్రౌండ్‌లో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తరపున ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ ఔటయ్యాడు. శిఖర్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ మైదానానికి చేరుకున్నాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ బాదిన రోహిత్‌తో కలిసి విరాట్ కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.

రోహిత్ ఔటైన తర్వాత సురేష్ రైనా విరాట్‌కు మద్దతుగా నిలిచాడు. రైనా 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. కేవలం 3 బంతుల్లోనే ధోని 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. విరాట్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి నాటౌట్‌గా నిలిచాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేశాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

భారత క్రికెట్ జట్టు 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 151 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తరఫున ఆరోన్ ఫించ్ 44 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. 3.3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. ఈ విధంగా జనవరి 26న భారత జట్టు 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి, రిపబ్లిక్ డేను ఘనంగా చేసుకుంది.

Also Read: IND vs WI: టీమిండియా ప్లేయింగ్‌XIలో కీలక మార్పులు.. సౌతాఫ్రికా దెబ్బకు వారంతా విశ్రాంతిలోనే?

IPL 2022: అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం కష్టం.. టీమిండియాకు ఫ్యూచర్ స్టార్ లిస్టులో తప్పక ఉంటాడు: కేఎల్ రాహుల్