IPL 2022: అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం కష్టం.. టీమిండియాకు ఫ్యూచర్ స్టార్ లిస్టులో తప్పక ఉంటాడు: కేఎల్ రాహుల్

Ravi Bishnoi: రవి బిష్ణోయ్ పంజాబ్ కింగ్స్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడాడు. ప్రస్తుతం వారిద్దరూ IPL-2022లో మరోసారి కలిసి ఒకే టీం తరపున ఆడనున్నారు.

IPL 2022: అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం కష్టం.. టీమిండియాకు ఫ్యూచర్ స్టార్ లిస్టులో తప్పక ఉంటాడు: కేఎల్ రాహుల్
Kl Rahul Ravi Bishnoi
Follow us
Venkata Chari

|

Updated on: Jan 26, 2022 | 7:11 AM

IPL 2022: ఐపీఎల్ 2022(IPL 2022)లో రెండు కొత్త జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అందులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఒకటి. ఈ జట్టుకు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతనితో పాటు, ఫ్రాంచైజీ తన జట్టులో పంజాబ్‌కు చెందిన రవి బిష్ణోయ్‌(Ravi Bishnoi)ను చేర్చుకుంది. ఈ లెగ్ స్పిన్నర్ భారత క్రికెట్‌కు తదుపరి స్టార్ కాగలడని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2020లో ఆడిన అండర్-19 ప్రపంచకప్‌లో రవి బలమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఇక్కడ నుంచి రవి వేగం పెంచాడు. పంజాబ్ కింగ్స్ అతనిని IPL-2020 కోసం తమ జట్టులో ఎంపిక చేసింది. ఈ ఆటగాడు ఆటైంలోనూ ఆకట్టుకున్నాడు. తొలి సీజన్‌లో అతను జట్టుకు ప్రధాన ఆయుధంగా నిలిచాడు. గత సీజన్‌లోనూ తన స్పిన్‌తో ఆకట్టుకున్నాడు. రాహుల్ కెప్టెన్సీలో రవి IPL ఆడాడు. ఇప్పుడు ఈ జంట తదుపరి సీజన్‌లో కొత్త జట్టుతో కనిపించనుంది.

రవి ఎంతో ప్రతిభావంతుడు.. రెండు ఐపీఎల్ సీజన్లలో రవి మొత్తం 23 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. 2021లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. 2020లో 14 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ యువ ఆటగాడిలో పోరాట పటిమ ఎంతో ఉందని రాహుల్ కొనియాడాడు. ఇంగ్లీష్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన రాహుల్, “అతను చాలా పోరాటశీలి. అండర్-19 ప్రపంచకప్ తర్వాత అతను ఐపీఎల్‌లో తన మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు, అతని ప్రత్యేకత అతనిని మిగిలిన వారి నుంచి వేరు చేసింది. ఐపీఎల్ చాలా పెద్ద వేదిక అని, ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడాడు. అతను పోరాడాలనుకున్నాడు” అని తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు.

టీమిండియాకు రవి తర్వాతి స్టార్ కావచ్చు.. రాహుల్ మాట్లాడుతూ, “అతను రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి బ్యాట్స్‌మెన్స్‌కు వ్యతిరేకంగా బౌలింగ్ చేశాడు. వారిద్దరూ స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడతారు. రవి బౌలింగ్‌లో నేను ఆడాను. చాలా కష్టంగానే ఉంది. అతను భారత క్రికెట్‌కు తదుపరి స్టార్‌గా మారే అవకాశం ఉంది. అతను జాతీయ జట్టులోకి వచ్చి, టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్‌గా నిలిచేలా అతనికి సహాయం చేయడం మా బాధ్యత’ అని చెప్పుకొచ్చాడు.

Also Read: IND vs WI: ఒత్తిడిలో 120 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ అతని స్పెషాలిటీ.. ఏ ప్లేస్‌లో వచ్చినా దబిడ దిబిడే: దినేష్ కార్తీక్

Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ తండ్రి అయ్యాడు.. పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..