IND vs WI: ఒత్తిడిలో 120 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ అతని స్పెషాలిటీ.. ఏ ప్లేస్‌లో వచ్చినా దబిడ దిబిడే: దినేష్ కార్తీక్

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని దినేష్ కార్తీక్ టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. అప్పుడే అతనిలో సత్తా బయటకు వస్తుందని తెలిపాడు.

IND vs WI: ఒత్తిడిలో 120 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ అతని స్పెషాలిటీ.. ఏ ప్లేస్‌లో వచ్చినా దబిడ దిబిడే: దినేష్ కార్తీక్
Surya Kumar
Follow us
Venkata Chari

|

Updated on: Jan 26, 2022 | 6:58 AM

India Vs West Indies: దక్షిణాఫ్రికా పర్యటన టీమిండియా(India vs South Africa)కు చెడ్డ కలలాగా నిరూపణ అయింది. కానీ, వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో, జట్టు ఆశల కిరణాన్ని చూసింది. మైదానంలో అద్భుతాలు చేసే సత్తా ఉన్న ఆటగాడు టీమిండియాకు చివరి వన్డే మ్యాచ్‌లో దొరికాడు. ఈ బ్యాట్స్‌మెన్‌ని అద్భుత ఆటగాడిగా దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. అతనేవరోకాదు సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav). ఏబీ డివిలియర్స్ లాగా ఫీల్డ్ చుట్టూ షాట్లు కొట్టే సత్తా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని దినేష్ కార్తీక్(Dinesh Karthik) కోరుకుంటున్నాడు.

క్రిక్‌బజ్‌తో ప్రత్యేక సంభాషణలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ, ‘దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో సూర్యకుమార్ వేరే లెవల్లో బ్యాటింగ్ చేశాడు. సూర్య ఆడిన షాట్లు నిజంగా అద్భుతం. అతను కష్ట సమయాల్లో బ్యాటింగ్ చేశాడు. అది చాలా సులభం అనిపించింది. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. సూర్యకుమార్ అద్భుతాలు చేయగలడని ఆశిస్తున్నాను. అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడల్లా పరిస్థితులు చాలా ఒత్తిడికి లోనవుతాయి.

సూర్యకుమార్ చాలా డేంజర్.. దినేష్ కార్తీక్ సూర్యకుమార్ యాదవ్‌ను చాలా ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. ఎందుకంటే అతనికి ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. దినేష్ కార్తీక్ మాట్లాడుతూ, ‘సూర్యకుమార్‌కు ఫీల్డింగ్ చేయడం కష్టం. ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేసినా సూర్యకుమార్ అదే వేగంతో ఆడడం గొప్ప విషయం. అతను ముంబై ఇండియన్స్ తరఫున 3వ స్థానంలో ఆడుతున్నాడు. టీమ్ ఇండియా అతనిని 4 లేదా 5 నంబర్‌లో ఆడిస్తే, అతను చాలా పరుగులు చేయగలడు. కానీ, అతనికి 5 లేదా 6వ నంబర్‌లో అవకాశం ఇస్తే, వన్డే క్రికెట్‌లో అతను మ్యాచ్‌ను చాలా వేగంగా మార్చగలడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అందులో అతని బ్యాట్ నుంచి ఒక సిక్స్, నాలుగు ఫోర్లు వచ్చాయి. కష్టకాలంలోనూ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ 121గా ఉండడం అతని సత్తా ఏంటో తెలియజేస్తోంది. అయితే ఏరియల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. సూర్యకుమార్ యాదవ్ 4 వన్డేలలో 54 కంటే ఎక్కువ సగటుతో 163 ​​పరుగులు చేశాడు. అయితే టీ20 లో, అతని బ్యాట్ 9 ఇన్నింగ్స్‌లలో 3 అర్ధ సెంచరీలు సాధించింది.

Also Read: Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెప్ప చెల్లుమనిపించిన తండ్రి.. వైరల్ అయిన వీడియో..

Virat Kohli: విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రవిశాస్త్రి.. ICC టైటిల్ అందరు గెలవలేరంటూ వ్యాఖ్యలు..