AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రవిశాస్త్రి.. ICC టైటిల్ అందరు గెలవలేరంటూ వ్యాఖ్యలు..

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(ravi shastri ) విరాట్ కోహ్లీకి(virat kohli) మద్దతుగా నిలిచాడు. కోహ్లీ మునుపటిలా ఆడతాడని పేర్కొన్నాడు....

Virat Kohli: విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రవిశాస్త్రి.. ICC టైటిల్ అందరు గెలవలేరంటూ వ్యాఖ్యలు..
టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ హఠాత్తుగా తప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. విరాట్ కోహ్లీ ఈ చర్యపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే రోహిత్ శర్మ గురించి కూడా ఈ మాజీ కోచ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
Srinivas Chekkilla
|

Updated on: Jan 25, 2022 | 3:25 PM

Share

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(ravi shastri ) విరాట్ కోహ్లీకి(virat kohli) మద్దతుగా నిలిచాడు. కోహ్లీ మునుపటిలా ఆడతాడని పేర్కొన్నాడు. కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదులుకోవడంపై శాస్త్రి మాట్లాడుతూ, ఇది వ్యక్తిగత నిర్ణయమని, అలాంటి నిర్ణయాలను గౌరవించాలని అన్నారు. ‘ఇది అతని నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి. ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. గతంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీని విడిచిపెట్టారు. అది సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, MS ధోనీ(MS Dhoni), ఇప్పుడు విరాట్ కోహ్లీ కావచ్చు.’ అని చెప్పాడు. కెప్టెన్సీ ఎపిసోడ్ తర్వాత అతని బాడీ లాంగ్వేజ్ మారిపోయిందా అని అడిగిన ప్రశ్నకు శాస్త్రి, సమాధానం ఇచ్చాడు. “నేను ఈ సిరీస్‌లో ఒక్క బంతిని కూడా చూడలేదు కానీ విరాట్ కోహ్లీ పెద్దగా మారతాడని నేను అనుకోను. ఏడేళ్ల తర్వాత క్రికెట్‌కు విరామం ఇచ్చాను. ఒక్కటి మాత్రం నేను పబ్లిక్‌లో విభేదాల గురించి బహిరంగంగా మాట్లాడను. నా పదవీ కాలం ముగిసిన రోజు నుంచి పబ్లిక్ ఫోరమ్‌లో నా ఆటగాళ్ల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశాను.’ అని తెలిపాడు.

‘కోహ్లీ 68 టెస్టుల్లో 40 గెలిచి అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని కెప్టెన్సీలో భారత జట్టు ఏ ICC టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. దీని ఆధారంగా కెప్టెన్‌ను అంచనా వేయకూడదని శాస్త్రి అన్నాడు. చాలా మంది పెద్ద ఆటగాళ్లు ప్రపంచకప్ గెలవలేదు. దీంతో ఏం జరిగింది? సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే గెలవకపోతే చెడ్డ ఆట6గాళ్లు అంటారా? మనకు ఎంత మంది ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్లు ఉన్నారు? సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తర్వాత గెలిచాడు.’ అని చెప్పాడు.

కెప్టెన్సీ విషయంలో బీసీసీఐతో కోహ్లీ స్టాండ్‌పై మాట్లాడుతూ.. ‘డైలాగ్‌లు చాలా ముఖ్యం. వాళ్ల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. నేను అందులో భాగం కాదు. ఇరువర్గాలతో మాట్లాడకుండా ఏమీ చెప్పలేను. సమాచారం లేని పక్షంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. అని పేర్కొన్నాడు.

Read Also.. Watch Video: రైలు ముందు ధోనీ పరుగులు.. ఇదేం యాడ్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు