IND vs AUS 3rd Test Day 4: అడ్డుపడుతోన్న వర్షం.. 5 వికెట్లు కోల్పోయిన భారత్.. రాహుల్ హాఫ్ సెంచరీ
India vs Australia Day 4 Score, 3rd Test: 33 పరుగుల వద్ద లైఫ్ అందుకున్న కేఎల్ రాహుల్.. తన అద్భుతమైన ఆటతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా స్కోర్‌ను 100 పరుగులు దాటించాడు. ప్రస్తుతం వర్షంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
India vs Australia Day 4 Score, 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. నేడు మంగళవారం నాలుగో రోజు కొనసాగుతోంది. తొలి సెషన్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 105 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 340 పరుగుల ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ 68, రవీంద్ర జడేజా 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఈ సిరీస్‌లో రాహుల్ రెండో అర్ధశతకం సాధించాడు. ప్రస్తుతం వర్షంతో ఆటను కొద్దిసేపు నిలిపేశారు.
10 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అతను వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
భారత జట్టు 51/4 స్కోరుతో ఉదయం ఆట ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 33 పరుగులు చేయగా, రోహిత్ శర్మ జీరోతో ఇన్నింగ్స్‌ని నడిపించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
నేడు కూడా వర్షం పడే ఛాన్స్..
ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, డిసెంబర్ 17న బ్రిస్బేన్‌లో 40% వర్షం కురిసే అవకాశం ఉంది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..