IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్.. సిడ్నీలోనూ మారని టీమిండియా బ్యాటింగ్

IND vs AUS 5th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 5వ, చివరి టెస్టు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, మొదటి రోజు లంచ్ సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 57 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 12 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. 20 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్, 10 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్, 4 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యారు. నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్.. సిడ్నీలోనూ మారని టీమిండియా బ్యాటింగ్
Ind Vs Aus 5th Test
Follow us
Venkata Chari

|

Updated on: Jan 03, 2025 | 7:30 AM

IND vs AUS 5th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 5వ, చివరి టెస్టు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, మొదటి రోజు లంచ్ సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 57 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 12 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. 20 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్, 10 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్, 4 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యారు. నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. అయితే, గాయం కారణంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. శుభ్‌మన్ గిల్ తిరిగి రాగా, ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి

47 ఏళ్లుగా సిడ్నీలో భారత్ గెలవలేదు. గత 13 ఏళ్లలో టీం ఇండియాకు ఓటమి ఎదురుకాలేదు. చివరిసారి 2012లో ఇక్కడ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ ఓటమి తర్వాత టీమిండియా ఇక్కడ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక్కడ భారత్ ఒక్క టెస్టులో మాత్రమే విజయం సాధించింది. 1978లో జట్టు ఈ విజయాన్ని అందుకుంది.

సిడ్నీ టెస్టులో ఇరు జట్లు..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి