India vs Pakistan: ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు టీమిండియా.. పీసీబీ ఛైర్మన్ నజం సేథీ కీలక ప్రకటన

India vs Pakistan Asia Cup: ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.

India vs Pakistan: ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు టీమిండియా.. పీసీబీ ఛైర్మన్ నజం సేథీ కీలక ప్రకటన
India Vs Pakistan
Follow us

|

Updated on: Jan 25, 2023 | 8:59 PM

India vs Pakistan Asia Cup: ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్, ఆపై వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి భారత్ వర్సెస్ పాకిస్థాన్‌ బోర్డుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈసారి ఆసియా కప్ పాకిస్థాన్ ఆతిథ్యంలో జరగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఇప్పుడు ఇందులో వివాదం ఏంటంటే.. ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ టూర్‌కు వెళ్లకపోవడమే. దీనిపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఆసియాకప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ వెళ్లబోదనే విషయాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు జై షా గతేడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజా కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు రాకపోతే, పాకిస్తాన్ జట్టు కూడా ప్రపంచ కప్‌ ఆడేందుకు భారత్‌కు వెళ్లదని బెదిరించాడు.

ఆసియా కప్ హాఫ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన జైషా..

జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఇటీవల ఏసీసీ అధ్యక్షుడిగా జై షా, రాబోయే రెండేళ్ల (2023-24) కోసం ఆసియా క్రికెట్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఆసియా కప్ కూడా చేర్చారు. ఆసియా కప్ తేదీలు, వేదికలు మాత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత ఆసియా కప్‌ను పాకిస్థాన్‌ నుంచి తటస్థ వేదికకు మార్చే అవకాశం ఉందని కూడా చర్చలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇంతలో, పీసీబీ ఛైర్మన్ కూడా మారారు. నజం సేథీ కొత్త చీఫ్‌గా వచ్చాడు. ఇటువంటి పరిస్థితిలో, ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటన చేయకుండా, నజామ్ సేథీ తెలివిగా నిర్ణయించుకున్నారు. సమావేశంలో విషయాన్ని తేల్చాలని జై షాను కోరారు. ఫిబ్రవరి 4న ఏసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం బహ్రెయిన్‌లో జరగనుంది. ఈ సమాచారాన్ని స్వయంగా నజం సేథీ తెలిపారు.

ఏసీసీ సమావేశంలో నజం సేథీ ఏం నిర్ణయం తీసుకుంటారో..

అదే సమయంలో, ఆసియా కప్, ప్రపంచ కప్ విషయానికి వస్తే, బీసీసీఐ ఇప్పటికీ తన స్టాండ్‌పై మొండిగా ఉందని నజం సేథీ అన్నారు. పాకిస్థాన్ టీమ్ ఇండియా టూర్‌కు వెళ్లాలని, కానీ టీమ్ ఇండియా మాత్రం పాకిస్థాన్ కు రాదనడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు. సమావేశం తర్వాతే ఏ విషమైనా చెప్పగలమంటూ నజం సేథీ తేల్చేశారు.

నజామ్ సేథీ మాట్లాడుతూ, ‘చివరగా ఏసీసీ అధికారిక సమావేశానికి తేదీని నిర్ణయించాం. ఫిబ్రవరి 4న బహ్రెయిన్‌లో జరిగే ఏసీసీ సమావేశానికి హాజరవుతాను. నా స్టాండ్ ఇప్పుడే చెప్పలేను. పరిస్థితిని గమనిస్తున్నామని, సమావేశంలోనే మా వైఖరిని చెబుతాం. పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించాలని బీసీసీఐ కోరుతోంది. అయితే టీం ఇండియా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడడం బీసీసీఐకి ఇష్టం లేదు. ఇది మాకు కొత్త విషయం కూడా కాదంటూ’ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా