AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి రోజు.. టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?

Shreyas Iyer Captaincy: యువ ఆటగాళ్లతో కూడిన ఈ భారత జట్టు ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పరువు కాపాడుకోవాలంటే చివరి మ్యాచ్‌లోనైనా గెలవాల్సి ఉంటుంది. జులై 11న సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌లోనైనా భారత్ పరువు నిలుపుకుంటుందో లేదో చూడాలి.

భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి రోజు.. టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?
Team India Records Vs England
Venkata Chari
|

Updated on: Jul 10, 2026 | 10:22 AM

Share

Shreyas Iyer Captaincy: భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాభవం ఎదురైంది. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ పరాజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో ఇంగ్లండ్ కైవసం చేసుకోగా, మన జట్టు ఎన్నో అవమానకరమైన రికార్డులను మూటగట్టుకుంది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లండ్.. చేతులెత్తేసిన భారత బౌలర్లు..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. అయితే ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాటర్లు తేల్చిపారేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (59 పరుగులు), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 పరుగులు) భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కేవలం 13.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఈ ఓటమితో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.

ఇది కూడా చదవండి: వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

ఇవి కూడా చదవండి

చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమి.. బంతుల పరంగా భారత్ వినాశనం..

భారత జట్టు 150 కంటే ఎక్కువ పరుగులు చేసి, ఆ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బంతుల పరంగా ఎదుర్కొన్న అత్యంత పెద్ద పరాజయం ఇదే కావడం గమనార్హం. ఇంగ్లండ్ జట్టు ఇంకా 37 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలోనే 24 బంతులు మిగిలి ఉండగా భారత్ ఓడిపోగా, ఇప్పుడు ఆ రికార్డును మరింత దారుణంగా తిరగరాసింది. మొత్తంగా టీ20 క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది మూడో అతిపెద్ద ఓటమి.

ఇంగ్లండ్ ఖాతాలో సరికొత్త రికార్డుల పంట..

ఈ విజయంతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పలు ప్రతిష్టాత్మక రికార్డులను తన పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్య ఛేదనలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా గెలిచిన రికార్డును ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. అలాగే రెండు దేశాల మధ్య కనీసం రెండు మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. గత ఆరు సిరీస్‌లలో భారత్ ఐదింటిని గెలవగా, ఒకటి సమంగా ముగిసింది.

ఇది కూడా చదవండి: గౌతమ్ గంభీర్‌కి గుడ్ బై.. కొత్త కోచ్ రేసులో ముగ్గురు దిగ్గజాలు.. సంచలన నిర్ణయం దిశగా బీసీసీఐ..?

ఎనిమిదేళ్ల రికార్డుకు తెర.. కుప్పకూలిన భారత ఆధిపత్యం..

ఈ ఘోర పరాజయం భారత క్రికెట్ ఆధిపత్యానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. 2018 మధ్య కాలంలో టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత, ఇంగ్లండ్ చేతిలో ఏ ఫార్మాట్‌లోనైనా భారత్ ఒక సిరీస్‌ను కోల్పోవడం ఇదే మొదటిసారి. సుమారు ఎనిమిదేళ్ల పాటు ఇంగ్లండ్‌పై కొనసాగించిన సిరీస్ విజయాల రికార్డుకు ఈ ఓటమితో తెరపడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!