AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!

Shreyas Iyer First Indian Captain to Lose T20I Series: ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు ఇలా వరుస సిరీస్‌ల్లో చేతులెత్తేయడం అభిమానులను కలవరపెడుతోంది. కొత్త మేనేజ్‌మెంట్, కొత్త కెప్టెన్సీ కింద జట్టు ఇంకా తన లయను అందుకోవాల్సి ఉంది. ఈ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, రాబోయే ఆఖరి మ్యాచ్‌లోనైనా భారత్ పరువు నిలుపుకుంటుందో లేదో చూడాలి.

Venkata Chari
|

Updated on: Jul 10, 2026 | 7:51 AM

Share
Shreyas Iyer First Indian Captain to Lose T20I Series: టీమిండియా సరికొత్త టీ20 శకం ఊహించని రీతిలో పరాజయాల బాట పట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఈ పరాజయంతో సరికొత్త సారథి శ్రేయస్ అయ్యర్ ఖాతాలో ఒక అవాంఛిత రికార్డు చేరింది.

1 / 6
ఐర్లాండ్ టు ఇంగ్లండ్.. పీడకలలా మారిన అయ్యర్ ప్రయాణం: సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ప్రపంచ ఛాంపియన్లుగా యూరప్ పర్యటనకు వెళ్లిన భారత్.. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐర్లాండ్ పర్యటనలో 0-2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదే పేలవ ప్రదర్శనను పునరావృతం చేసింది. వరుసగా రెండు ద్వైపాక్షిక సిరీస్‌లను చేజార్చుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

2 / 6
కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. చరిత్రలో తొలిసారి..: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ కెప్టెన్లు ఇంగ్లండ్ గడ్డపై అద్భుత విజయాలు సాధించారు. 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో, 2022లో రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ అక్కడ టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. ధోని హయాంలో కొన్ని ఏకైక మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ, ఇంగ్లండ్‌లో ఒక పూర్తి స్థాయి టీ20 సిరీస్‌ను భారత్ ఎప్పుడూ కోల్పోలేదు. కానీ, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఆ పరంపరకు బ్రేక్ వేసి, ఇంగ్లండ్‌లో టీ20 సిరీస్ ఓడిపోయిన మొదటి భారతీయ కెప్టెన్‌గా అయ్యర్‌ను నిలబెట్టింది.

3 / 6
కెప్టెన్ పోరాటం వృథా.. సాల్ట్, బ్రూక్ విధ్వంసం..: నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు కేవలం 48 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేస్తూ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరునందించాడు.

4 / 6
అయితే 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు ఎలాంటి పోటీని ఇవ్వలేకపోయారు. జోస్ బట్లర్ త్వరగానే అవుట్ అయినా, ఫిలిప్ సాల్ట్ (42 బంతుల్లో 59*), హ్యారీ బ్రూక్ (35 బంతుల్లో 79*) భారత బౌలింగ్‌ను చీల్చిచెండారు. కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్ కోల్పోయి ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో భారత్‌పై సాధించిన తొలి పూర్తి స్థాయి టీ20 సిరీస్ విజయం ఇది.

5 / 6
టాస్ గెలుస్తున్నా.. మ్యాచ్‌లు మాత్రం చేజారుతున్నాయి..: ఈ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ అదృష్టం టాస్ వరకే పరిమితమవుతోంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అయ్యర్ టాస్ గెలుస్తున్నప్పటికీ, ఆ గెలుపును మ్యాచ్ విజయాలుగా మార్చడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి, ఐదింటిలోనూ పరాజయం పాలుకావడం కెప్టెన్‌గా అయ్యర్‌కు కోలుకోలేని దెబ్బ.

6 / 6
Follow Us
కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!

గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..?

కారులో ఫ్యూయల్‌ క్యాప్‌ ఎడమ వైపున లేదా కుడి వైపున ఎందుకు ఉంటుంది?

ముంబైకి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ చేయించుకోనున్న జనసేనాని..

లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.

వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం

ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!

ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ రక్షణ కోసం

బొద్దింకలు బ్రహ్మాస్త్రం.. ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే..