AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు..

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా 202

IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు..
Ind Vs Sa
uppula Raju
| Edited By: Narender Vaitla|

Updated on: Jan 03, 2022 | 9:29 PM

Share

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా 202 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంబించిన సౌతాప్రికా ఒక వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. దీంతో ఇప్పటివరకు సౌతాఫ్రికా.. భారత్ కంటే 167 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో డీన్‌ ఎల్గర్‌ 11 పరుగులు, పీటర్సన్‌ 14 పరుగులు నాటౌట్‌గా ఉన్నారు. కాగా భారత బౌలర్లలో మహమ్మద్‌ షమికి ఒక వికెట్‌ దక్కింది.

అంతకు ముందు మొదటగా బ్యాటింగ్‌ చేపట్టిన ఇండియాకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. మయాంక్ అగర్వాల్ 26 పరుగులకు ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా 3 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అజింకా రహానె డకౌట్‌ అయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ని కెప్టెన్‌ కెఎల్‌.రాహుల్‌ హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. 128 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.

116 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివరగా జస్ప్రీత్‌ బుమ్రా రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో భారత్ స్కోరు 200 పరుగలైనా దాటగలిగింది. మహ్మద్‌ సిరాజ్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్‌ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ మూడు వికెట్లు సాధించారు.

Weight Loss Tips: చలికాలంలో బరువు తగ్గాలంటే ఈ విషయాలు తెలుసుకోండి..

చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటున్నారా..! జాగ్రత్త ఈ సమస్యలు వచ్చే అవకాశం..

Health care tips: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవితాన్నే మార్చేస్తుందని మీకు తెలుసా.. కొత్త ఏడాదిలో కొత్తగా ట్రై చేయండి..