IND Vs SL: జోష్ మీదున్న టీమిండియా.. వైట్‌వాష్‌కు తహతహ.. టీంలో కీలక మార్పులు.?
IND vs SL 3rd ODI: వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ భారత జట్టు.. శ్రీలంకతో ఇవాళ జరగబోయే మూడో వన్డే కోసం సిద్ధమైంది.

IND vs SL 3rd ODI: వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ భారత జట్టు.. శ్రీలంకతో ఇవాళ జరగబోయే మూడో వన్డే కోసం సిద్ధమైంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ నడుస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
శ్రీలంక టూర్‌లో ఉన్న యువ భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తొలుత అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అయితే, తొలి మ్యాచ్‌లో విజయంతో విమర్శకుల నోళ్లు కాస్త మూత పడ్డాయి. ఇక రెండో వన్డేలో వారు సాధించిన అద్భుతమైన విజయంతో సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. 193 పరుగుల వద్ద భారత్ ఏడు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఉత్కంఠభరిత పోరులో టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. అదే ఊపులో మూడో వన్డేను కూడా గెలిచి శ్రీలంకను వైట్ వాష్ చేయాలని భావిస్తున్నారు యువ ఆటగాళ్లు.
కాగా, కొలంబోలో శుక్రవారం జరిగే మూడో వన్డేలో మానసికంగా చతికిలపడిపోయిన శ్రీలంక జట్టుతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టు తలపడేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యేందుకు భారత్‌కు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవాళ జరుగబోయే మూడో వన్డే సహా.. మరో మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్రావిడ్ సరికొత్త వ్యూహానికి తెరలేపాడు. టీ20 వరల్డ్ కప్‌ని టార్గెట్‌గా పెట్టుకున్న ద్రావిడ్.. చివరి వన్డేలో మరికొంత మంది ప్రతిభావంతులైన యువకులకు అవకాశం కల్పించాలని తలంచాడు. ఆ కారణంగానే గడిచిన రెండు మ్యాచ్‌ల్లో సరైన ప్రతిభ కనబరచని వారి ప్లేస్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నాడు. మూడో వన్డేలో మనీష్ పాండే స్థానంలో సంజు సామ్సన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నారు.
శ్రీలంకతో జరుగనున్న మూడో వన్డే కోసం భారత జట్టు(అంచనా ప్రకారం): శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్.
Also read:
Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..
Library: ఆ లైబ్రరీలో పుస్తకం దొంగిలిస్తే తప్పించుకోలేరు.. హైటెక్ నిఘాతో ఇట్టే పట్టేస్తారు
Yamaha FZ25: యమహా ఎఫ్‌జెడ్ 25 మోటో జీపీ ఎడిషన్ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్.. ధర ఎంతంటే..!