AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రోహిత్ సేనకు మరో బిగ్ షాక్.. జరిమానాతోపాటు డబ్ల్యూటీసీ పాయింట్లతో భారీ కోత వేసిన ఐసీసీ.. ఎందుకంటే?

WTC 2025: సెంచూరియన్ టెస్టులో భారత్ మూడో రోజు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టును 131 పరుగులకు ఆలౌట్ చేసింది. విరాట్ కోహ్లి అర్ధశతకం సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాండ్రే బెర్గర్ 4 వికెట్లు తీశాడు. ఈ ఓటమితో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. జరిమానాతోపాటు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లలోనూ కోత పడింది.

Team India: రోహిత్ సేనకు మరో బిగ్ షాక్.. జరిమానాతోపాటు డబ్ల్యూటీసీ పాయింట్లతో భారీ కోత వేసిన ఐసీసీ.. ఎందుకంటే?
Ind Vs Sawtc 2025 Icc
Venkata Chari
|

Updated on: Dec 29, 2023 | 1:58 PM

Share

ICC World Test Championship: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఓపెనింగ్ టెస్ట్‌లో రెండు ఓవర్లు తక్కువ బౌలింగ్ చేసినందుకు రోహిత్ శర్మ జట్టు రెండు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్లను కోల్పోయింది. అలాగే, భారత జట్టు మ్యాచ్ ఫీజులో 10% జరిమానా కూడా విధించింది.

ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన క్రిస్ బ్రాడ్, భారత్ లక్ష్యానికి రెండు ఓవర్లు తక్కువగా ఉండటంతో ఈ శిక్షను విధించాడు.

ఆర్టికల్ 2.22 ప్రకారం టీమ్ ఇండియాకు జరిమానా..

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం టీమ్ ఇండియాకు ఈ జరిమానా విధించారు. ఇది కనీస ఓవర్ రేట్‌కి సంబంధించినది. ఇందులో, ఆటగాళ్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 5% జరిమానా విధిస్తారు.

పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయిన టీమ్ ఇండియా..

స్లో ఓవర్ రేట్‌కు పాయింట్లు తగ్గించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా స్థానం బలహీనంగా మారింది. దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత టీమిండియా 16 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. అయితే, పాయింట్లు తగ్గడంతో 14 పాయింట్లతో ఆ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది.

తొలి టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం..

సెంచూరియన్ టెస్టులో భారత్ మూడో రోజు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టును 131 పరుగులకు ఆలౌట్ చేసింది. విరాట్ కోహ్లి అర్ధశతకం సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాండ్రే బెర్గర్ 4 వికెట్లు తీశాడు.

మంగళవారం సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ సెంచరీతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేయగా, డీన్ ఎల్గర్ 185 పరుగులు చేశాడు. భారత్ 163 పరుగుల వెనుకంజలో ఉన్నప్పటికీ ఆ జట్టు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దక్షిణాఫ్రికా తరపున తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన డీన్ ఎల్గర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అతను తన కెరీర్‌లో చివరి సిరీస్‌ను ఆడుతున్నాడు.

తొలి టెస్టు విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో, చివరి టెస్టు 2024 జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..