AUS vs PAK: 10 వికెట్లతో చెలరేగిన ఎస్‌ఆర్‌హెచ్ కాస్ట్లీ ప్లేయర్.. కట్‌చేస్తే.. వార్నర్ మామకు అదిరిపోయే గిఫ్ట్..
Australia vs Pakistan, 2nd Test: మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో 3 టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇక ఈ సిరీస్‌పై పాకిస్తాన్ జట్టు తన నియంత్రణ కోల్పోయింది. మెల్‌బోర్న్‌కు ముందు పెర్త్ టెస్టులోనూ పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా విజయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో 10 వికెట్లు పడగొట్టాడు.

Australia vs Pakistan, 2nd Test: ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ జట్టుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మెల్ బోర్న్ టెస్టులో నాలుగో రోజు ఆ జట్టు కుప్పకూలింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో విజయం సాధించగా, మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కూడా కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌లో, ఆస్ట్రేలియా పాకిస్తాన్‌కు 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి ప్రతిస్పందనగా పాక్ జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ 264 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్‌కు మెల్‌బోర్న్ టెస్టులో సువర్ణావకాశం లభించింది. లక్ష్యం 317 పరుగులు, దానిని సాధించడానికి పాక్ జట్టుకు రెండు రోజుల పూర్తి సమయం ఉంది. కానీ, ఆస్ట్రేలియా బౌలర్ల ముందు పాకిస్థాన్ ప్లాన్ అంతా వృథా అయింది. ఫలితంగా సిరీస్‌ను ఓడిపోకుండా కాపాడుకోలేకపోయింది.
రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన పాకిస్థాన్ ..
O Captain! My Captain!@patcummins30 has been awarded the Johnny Mullagh Medal 🏅 pic.twitter.com/n8hY5Z4hwQ
— Melbourne Cricket Ground (@MCG) December 29, 2023
317 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం జరగలేదు. వీరి ఓపెనింగ్ జోడీ కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరింది. ఓపెనర్లిద్దరూ 50 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు. అంటే ఇప్పుడు ఆశలన్నీ జట్టులోని కీలకమైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లపైనే ఉన్నాయి. వారిలో ఒకరు కెప్టెన్ షాన్ మసూద్ కాగా, మరొకరు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం.
షాన్ మసూద్, బాబర్ ఆజం కలిసి మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. షాన్ మసూద్ 71 బంతుల్లో 60 పరుగులు చేయగా, బాబర్ ఆజం 79 బంతుల్లో 41 పరుగులు చేశాడు. పాకిస్థాన్ తరుపున సల్మాన్ అఘా కూడా ధీటుగా బ్యాటింగ్ చేసి 50 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆడుతున్నప్పుడు కూడా పాకిస్థాన్‌పై ఆశలు చిగురించాయి. కానీ, మ్యాచ్‌లో పాక్ పునరాగమనం చేస్తోందని అనిపించినప్పుడల్లా ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు తీసి పరాజయం వైపు నెట్టేశారు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్యాట్ కమిన్స్..
ఆస్ట్రేలియా తరపున కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కూడా తీశాడు. మెల్‌బోర్న్ టెస్టులో 10 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడే. ఈ విజయం కోసం, కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య సిరీస్‌లో మూడవ, చివరి టెస్టు సిడ్నీలో జరగనుండగా, ఇది డేవిడ్ వార్నర్‌కు చివరి టెస్టుగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
