AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నై చిన్నోడి బీభత్సం చూశారా?

Urvil Patel Fastest Fifty: ఐపీఎల్ 2026 సీజన్ 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉర్విల్ పటేల్ తన బ్యాట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 13 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును సమం చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Video: 6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నై చిన్నోడి బీభత్సం చూశారా?
Urvil Patel Fastest Fifty
Venkata Chari
|

Updated on: May 10, 2026 | 6:53 PM

Share

Urvil Patel Fastest Fifty: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్, మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరును ఒక వికెట్ నష్టానికి 97 పరుగులకు చేర్చాడు. 384.62 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఉర్విల్ పటేల్, లక్నో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఏకంగా 7 భారీ సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు.

జైస్వాల్ రికార్డు సమం.. డివిలియర్స్ అధిగమనం..

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఉర్విల్ పటేల్ పలు చారిత్రక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో సాధించిన వేగవంతమైన అర్థశతక రికార్డును ఉర్విల్ పటేల్ ఇప్పుడు సమం చేశాడు. అంతేకాకుండా, కేవలం 10 బంతుల్లోనే 42 పరుగులు సాధించడం ద్వారా, 2015లో ముంబైపై ఏబీ డివిలియర్స్ నెలకొల్పిన 41 పరుగుల రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు. మైదానంలో అతను సిక్సర్లు బాదుతుంటే లక్నో ఫీల్డర్లు ప్రేక్షకులుగా మిగిలిపోయారు.

తండ్రికి అంకితం.. భావోద్వేగ వేడుక..

తన అర్థశతకం పూర్తయిన వెంటనే ఉర్విల్ పటేల్ తన జేబులో నుంచి ఒక చిన్న కాగితాన్ని తీసి ప్రేక్షకులకు చూపించాడు. ఆ చిట్టీపై “ఇది మీ కోసమే నాన్న” (This is for you Papa) అని రాసి ఉంది. ఈ భావోద్వేగ క్షణం మైదానంలోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తన తండ్రికి ఈ చారిత్రక ఇన్నింగ్స్‌ను అంకితం ఇస్తూ అతను జరుపుకున్న వేడుక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఓవర్‌కు మూడు సిక్సర్లు.. బౌలర్ల బేజారు..

ఐదవ ఓవర్ వేసిన ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది ఉర్విల్ పటేల్ తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో దిగ్వేష్ రాఠీని కూడా వదలకుండా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. మొహమ్మద్ షమీ వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాది తన అర్థశతకాన్ని పూర్తి చేశాడు. అతని మెరుపు దాడితో మ్యాచ్ పూర్తిగా చెన్నై వైపు మొగ్గింది. యువ ఆటగాడైన ఉర్విల్ పటేల్ చూపిన ఈ తెగువ చెన్నై జట్టుకు ప్లేఆఫ్స్ దిశగా కొండంత బలాన్ని ఇచ్చింది. లక్నో జట్టు ఎంత ప్రయత్నించినా ఉర్విల్ పటేల్ విధ్వంసం ముందు తలవంచక తప్పలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
OTTకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
OTTకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ..
6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ..
ఆ సినిమాతో మా ఆస్తులన్ని పోయాయి.. అప్పుడు ఆదుకున్న దేవుడు ఆయనే..
ఆ సినిమాతో మా ఆస్తులన్ని పోయాయి.. అప్పుడు ఆదుకున్న దేవుడు ఆయనే..
ఈ ఐటెమ్స్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే హైదరాబాద్ ధమ్ బిర్యానీ..
ఈ ఐటెమ్స్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే హైదరాబాద్ ధమ్ బిర్యానీ..
అస్సాం అసెంబ్లీ నేతగా హిమంత బిస్వా శర్మ ఏకగ్రీవం!
అస్సాం అసెంబ్లీ నేతగా హిమంత బిస్వా శర్మ ఏకగ్రీవం!
నమ్మినవాళ్లే నన్ను ముంచేశారు.. అందుకే మనుషులపై నమ్మకం పోయింది..
నమ్మినవాళ్లే నన్ను ముంచేశారు.. అందుకే మనుషులపై నమ్మకం పోయింది..
బుల్లెట్ త్రోకు బలైన కావ్యపాప మాజీ ప్లేయర్.. వీడియో చూస్తారా..?
బుల్లెట్ త్రోకు బలైన కావ్యపాప మాజీ ప్లేయర్.. వీడియో చూస్తారా..?
కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియో
కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియో
కొంప ముంచుతున్న AI టూల్స్‌.. మీ డేటాను గుళ్లో ప్రసాదంలా పంచుతుంది
కొంప ముంచుతున్న AI టూల్స్‌.. మీ డేటాను గుళ్లో ప్రసాదంలా పంచుతుంది
ఘనంగా ఏబీవీపీ వ్యవస్థాపకులు కేల్కర్ శతజయంతి వేడుకలు
ఘనంగా ఏబీవీపీ వ్యవస్థాపకులు కేల్కర్ శతజయంతి వేడుకలు