AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: భారత్-జింబాబ్వే పోరుకు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే రోహిత్ సేన పరిస్థితి ఏంటంటే?

Melbourne Weather Forecast: ఇప్పటి వరకు మెల్‌బోర్న్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌లో డక్‌వర్త్-లూయిస్ నియమం ఫలితంగా ముగిసింది.

IND vs ZIM: భారత్-జింబాబ్వే పోరుకు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే రోహిత్ సేన పరిస్థితి ఏంటంటే?
Team India
Venkata Chari
|

Updated on: Nov 05, 2022 | 7:11 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (నవంబర్ 6) మెల్‌బోర్న్‌లో భారత్-జింబాబ్వే మధ్య 42వ మ్యాచ్ జరగనుంది. సూపర్-12 రౌండ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఇరు జట్లు తలపడనున్నాయి. మెల్‌బోర్న్‌లో టీమిండియాపైనే అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది, అయితే ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించవచ్చు. మెల్‌బోర్న్‌లో భారత జట్టు ఈ టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి ఆడనుంది. అంతకుముందు పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌పై వర్షం ఛాయలు కనిపించినా.. మ్యాచ్ రోజు రోజంతా మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం కురవలేదు.

మెల్‌బోర్న్‌లో మూడు మ్యాచ్‌లు రద్దు?

ఇప్పటి వరకు మెల్‌బోర్న్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌లో డక్‌వర్త్-లూయిస్ నియమం ఫలితంగా ముగిసింది. ఇప్పుడు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న భారత్-జింబాబే మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందా? మెల్‌బోర్న్‌లో జరిగే మరో మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.

ఆదివారం మెల్‌బోర్న్ వాతావరణం ఎలా ఉంటుంది?

Weather.com ప్రకారం, వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, మ్యాచ్ సమయంలో మేఘావృతమై ఉండవచ్చు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. అప్పటికి మెల్‌బోర్న్‌లో సాయంత్రం ఏడు గంటలవుతుంది. రాత్రి 7 గంటల తర్వాత వర్షం కురిసే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి.

ఒకవేళ వర్షం పడితే?

వర్షం పడితే మ్యాచ్‌ని కనీసం ఐదు-ఐదు ఓవర్లకు కుదించవచ్చు. ఇరు జట్లు చెరో ఐదు ఓవర్లు కూడా ఆడకపోతే, మ్యాచ్ రద్దు చేస్తారు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. రెండు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభిస్తుంది. అలా అయినా టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది.

ఇరు జట్లు:

భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా.

జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కీపర్), రెగిస్ చకబ్వా (కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ షుంబా, ర్యాన్ బర్లే, ల్యూక్ జోంగ్వే, టెండై చత్రా, రిచర్డ్ న్గర్వా, బ్లెస్సింగ్ ముజార్బానీ, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మమ్‌క్లెన్గా, వెల్లింగ్టన్ మదండే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..