IND vs WI: ఫిట్‌నెస్‌లో విఫలమైన విండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్.. వివాదంగా మారిన ఆ రూల్స్?

ఫిబ్రవరి 16 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు కోల్‌కతాలో జరగనున్నాయి.

IND vs WI: ఫిట్‌నెస్‌లో విఫలమైన విండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్.. వివాదంగా మారిన ఆ రూల్స్?
Ind Vs Wi
Follow us
Venkata Chari

|

Updated on: Jan 31, 2022 | 1:07 PM

India vs West Indies: భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ జట్టును ప్రకటించారు . ఈ జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే యువ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మెయర్‌(Kieron Pollard)కు జట్టులో స్థానం లభించలేదు. అతడిని ఎంపిక చేయకపోవడానికి కారణం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఫిట్‌నెస్‌ ఆధారంగా షిమ్రాన్ హెట్‌మెయర్‌ను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయలేదని చెబుతున్నారు. ఈ నెల ప్రారంభంలో, వెస్టిండీస్(West Indies Cricket Team) ప్రధాన కోచ్ ఫిల్ సిమన్స్ ఫిట్‌నెస్ పట్ల హెట్మెయర్(Shimron Hetmyer) విధానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌లోని కొత్త తరం ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌లలో హెట్మెయర్ ఒకరు. అతను అండర్ 19 క్రికెట్ నుంచి వెలుగులోకి వచ్చాడు. తన ఆటతో ఫలితాన్ని తనంతట తానుగా మార్చగల సత్తా కలిగి ఉన్నాడు.

25 ఏళ్ల తుఫాను బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. అప్పటి నుంచి అతను ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయితే ఫిల్ సిమన్స్ పదేపదే నిరాశపరచడం బాధిస్తుంది. చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ, “ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టు బాగా ఆడింది. మేం ఈ జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నాం. వారు అద్భుతమైన నైపుణ్యం, స్ఫూర్తిని కనబరిచారు. మేం భారతదేశంలోనూ అదే ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 3-2తో కైవసం చేసుకుంది.

ఓడిన్ స్మిత్ స్థానంలోకి ఎంట్రీ.. ఓడిన్ స్మిత్ కూడా భారత పర్యటనకు ఎంపికయ్యాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రోవ్‌మన్ పావెల్‌ను జట్టు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత పెద్దఎత్తున వివాదాలు జరిగాయి. జట్టు కోచ్, బోర్డు అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఇద్దరూ ఈ ఆరోపణలతో జట్టును విభజించే కుట్రగా పలువురు పేర్కొన్నారు.

సిరీస్ ఎలా సాగనుందంటే? ఫిబ్రవరి 16 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు కోల్‌కతాలో జరగనున్నాయి. దీనికి ముందు ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌ అహ్మదాబాద్‌లో జరగనుంది. పొలార్డ్ నేతృత్వంలో వెస్టిండీస్ ఇప్పటికే వన్డే జట్టును ప్రకటించింది. కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, డారెన్ బ్రేవో, జాసన్ హోల్డర్, షే హోప్, అకిల్ హొస్సేన్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడిన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్ వన్డే, టీ20 స్క్వాడ్‌లలో ఉన్నారు.

వెస్టిండీస్ టీ20 జట్టు.. కీరన్ పొలార్డ్ (సి), నికోలస్ పూరన్ (కీపర్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షే హోప్, అకిల్ హొస్సేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఓడిన్ స్మిత్స్, హేడెన్ వాల్ష్ Jr.

Also Read: IND vs WI: సచిన్ ప్రత్యేక రికార్డుపై కోహ్లీ చూపు.. తొలి వన్డేలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధం?

WI vs ENG: హ్యాట్రిక్‌తో జాసన్ హోల్డర్ విధ్వంసం.. చివరి మ్యాచులో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. టీ20 సిరీస్‌ విండీస్ సొంతం