AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs ENG: హ్యాట్రిక్‌తో జాసన్ హోల్డర్ విధ్వంసం.. చివరి మ్యాచులో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. టీ20 సిరీస్‌ విండీస్ సొంతం

టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆతిథ్య కీరన్ పొలార్డ్ జట్టు 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

WI vs ENG: హ్యాట్రిక్‌తో జాసన్ హోల్డర్ విధ్వంసం.. చివరి మ్యాచులో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. టీ20 సిరీస్‌ విండీస్ సొంతం
Eng Vs Wi
Venkata Chari
|

Updated on: Jan 31, 2022 | 8:45 AM

Share

West Indies Vs England: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను వెస్టిండీస్(West Indies) కైవసం చేసుకుంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్(Kieron Pollard) జట్టు 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. బ్యాట్‌తోపాటు, బంతితోనూ సిరీస్‌లో జాసన్ హోల్డర్(Jason Holder) అద్భుతంగా రాణించాడు. సిరీస్‌లోని నిర్ణయాత్మక పోరులో ఇంగ్లండ్ జట్టులో సగం మందిని పెవిలియన్ చేర్చి, మొత్తం సిరీస్‌లో 15 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. రెండు, నాలుగో టీ20ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, మొదటి, మూడో టీ20ల్లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. నిర్ణయాత్మక పోరులో ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు సిరీస్‌ను కోల్పోయింది.

వెస్టిండీస్ 20 ఓవర్లలో 179 పరుగులు.. 5వ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వెస్టిండీస్ నుంచి ఏ బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ చేయలేదు. అయినప్పటికీ ఇంత పెద్ద స్కోరు చేయడంతో విండీస్ బ్యాటింగ్ బలాన్ని తెలియజేస్తుంది. జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఇన్నింగ్స్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వీరితో పాటు రోవ్‌మన్ పావెల్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు బ్రెండన్ కింగ్, కైల్ మైయర్స్ జోడీ జట్టుకు శుభారంభం అందించి ఓపెనింగ్ వికెట్‌కు 59 పరుగులు జోడించారు.

17 పరుగుల దూరంలో ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో గెలవడానికి ఇంగ్లండ్ మొత్తం 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు విఫలమయ్యారు. జేమ్స్ విన్స్ 55 పరుగులు, సామ్ బిల్లింగ్స్ 41 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో మొత్తం 7గురు బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఫలితంగా జట్టు మొత్తం 19.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది.

హోల్డర్, అకిలా కలిసి 9 వికెట్లు.. ఇద్దరు వెస్టిండీస్ బౌలర్లు జాసన్ హోల్డర్, అకిలా హొస్సేన్ ఇంగ్లండ్ పరాజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 9 వికెట్లు తీశారు. జాసన్ హోల్డర్ హ్యాట్రిక్‌తో 27 పరుగులకు 5 వికెట్లు పడగొట్టగా, అకిలా 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధికంగా 15 వికెట్లు.. మ్యాచ్ చివరి 4 బంతుల్లో హోల్డర్ తన 5 వికెట్లలో 4 పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల పడగొట్టడంతో జాసన్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తం 15 వికెట్లు తీశాడు. తద్వారా ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.

Also Read: Hrdik Pndya: బయో బబుల్‌లో జీవించడం కష్టం.. అయినా తప్పదు..

Goutham Gambir: గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మతో ఎలాంటి వివాదం లేదు.. పాక్ మాజీ వికెట్ కీపర్..