AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ లిస్టులో చేరిన తొలి జట్టు.. అదేంటంటే?

Chennai Super Kings: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.

IPL 2022: రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ లిస్టులో చేరిన తొలి జట్టు.. అదేంటంటే?
Csk
Venkata Chari
|

Updated on: Jan 31, 2022 | 1:36 PM

Share

IPL 2022: ఐపీఎల్ 2022(IPL 2022) మెగా వేలానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతాలు చేసింది. IPL అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) దేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యునికార్న్‌గా అవతరించింది. ఈ టీమ్ మార్కెట్ క్యాప్ రూ.7600 కోట్లకు చేరుకుంది. గ్రే మార్కెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షేరు ధర దాదాపు రూ.210 నుంచి 225గా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో CSK ఇండియా సిమెంట్స్‌ను కూడా వదిలివేసింది. జనవరి 28న మార్కెట్ ముగిసే సమయానికి ఇండియా సిమెంట్స్ మార్కెట్ క్యాప్ రూ.6869 కోట్లుగా ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ క్యాపిటల్ పెరగడానికి రెండు పెద్ద కారణాలు చెబుతున్నారు. ఒకటి, ఈ జట్టు 2021 సంవత్సరంలో నాలుగోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు చేరాయి. ఈ రెండూ చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో ఐపీఎల్ బ్రాండ్‌పై నమ్మకం పెరిగింది. ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ , మాజీ బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ దీని గురించి సర్కిల్ ఆఫ్ క్రికెట్‌తో మాట్లాడుతూ, సీఎస్‌కే బ్రాండ్ ఇండియా సిమెంట్స్ బ్రాండ్‌ను మించిపోతుందని చెప్పారు. అమెరికాలో ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌ల చరిత్రను పరిశీలిస్తే, అది ప్రస్తావనకు వస్తుంది. భారత్‌లో క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. చాలా దేశాల్లో, ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లకు ప్రాధాన్యత లభిస్తుంది.

IPL గెలిచిన తర్వాత CSK ధరలు పెరిగాయి.. 26 అక్టోబర్ 2021న, CSKని నియంత్రిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (CSKCL) షేర్లు ఒక వారంలోపు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అప్పుడు షేరు ధర రూ.110-120 నుంచి రూ.220కి పెరిగింది. దీని కారణంగా CSKCL మార్కెట్ క్యాపిటల్ రూ.7000 కోట్లకు చేరుకుంది. అప్పుడు యునికార్న్ క్లబ్‌కు కేవలం రూ.500 కోట్ల దూరంలో ఉంది. ఐపీఎల్ 2021 ఫైనల్ జరిగిన 11 రోజుల్లోనే ఇది జరిగింది.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే, 2008 నుంచి 2021 వరకు, ఈ జట్టు ఐపిఎల్‌లో భాగమైనప్పుడల్లా, 2020 సీజన్ మినహా ప్రతిసారీ ప్లేఆఫ్‌లు లేదా సెమీ-ఫైనల్‌లకు చేరుకుంది. ముంబై ఇండియన్స్ (5) మాత్రమే CSK కంటే ఎక్కువ టైటిళ్లు గెలుచుకుంది.

యునికార్న్ క్లబ్ అంటే ఏమిటి? ఒక బిలియన్ డాలర్ల విలువ కలిగిన కొత్త కంపెనీలు లేదా స్టార్టప్‌లు యునికార్న్ క్లబ్‌లో భాగం. ఈ పదం 2013 సంవత్సరం నుంచి వచ్చింది. ఈ పదాన్ని అలిన్ లీ అనే అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఉపయోగించారు.

మరి ఈ గ్రే మార్కెట్ అంటే ఏమిటి? అధికారికంగా కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే అమ్మవచ్చు. దీని కోసం కంపెనీ జాబితా ఉంది. కానీ, లిస్ట్ కాని కంపెనీల షేర్లు గ్రే మార్కెట్‌లో అమ్ముడవుతాయి. ఈ మార్కెట్‌లో, అటువంటి కంపెనీల షేర్లు అమ్మకం, కొనుగోలు అవుతుంటాయి. ఇవి మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తుంటారు. లేదా అధికారిక ట్రేడింగ్‌కు ముందు సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయించాల్సి వస్తుంది.

Also Read: IND vs WI: ఫిట్‌నెస్‌లో విఫలమైన విండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్.. వివాదంగా మారిన ఆ రూల్స్?

IND vs WI: సచిన్ ప్రత్యేక రికార్డుపై కోహ్లీ చూపు.. తొలి వన్డేలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధం?