IND Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్.. హార్దిక్ టీంలోకి ధోని శిష్యుడు.. ఆ ప్లేయర్ ఎవరంటే.?

డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.

IND Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్.. హార్దిక్ టీంలోకి ధోని శిష్యుడు.. ఆ ప్లేయర్ ఎవరంటే.?
Ind Vs Wi
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 22, 2023 | 6:52 PM

డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును బీసీసీఐ జూన్ 27న ఎంపిక చేయనుంది. పలువురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి.. యువ ఆటగాళ్లకు ఈ టూర్‌లో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా ఐపీఎల్ 2023లో తమ ఆటతో అదరగొట్టిన యశ్వసి జైస్వాల్, రింకూ సింగ్, ముకేష్ కుమార్ భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వెటరన్ పేసర్ మోహిత్ శర్మ మళ్లీ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. హార్దిక్ టీంలోకి రింకూ సింగ్, జైస్వాల్‌లతో పాటు మరో యువ పేసర్ డెబ్యూ కానున్నాడని తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే. ఐపీఎల్‌ 2023లో ఈ బౌలర్ పరుగులు ధారాళంగా సమర్పించినప్పటికీ.. చెన్నై జట్టులో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఆడిన 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు.

కాగా, వెస్టిండీస్‌తో జరిగే టీ20లకు స్టార్ బౌలర్లైన షమీ, సిరాజ్‌లకు విశ్రాంతినిచ్చి.. అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, తుషార్ దేశ్‌పాండేలకు పేస్ ఎటాక్ అప్పజెప్పే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా, వెస్టిండీస్ సిరీస్.. జూలై 12 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.