IND vs SL: మనల్ని ఎవడ్రా ఆపేది? కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ.. దెబ్బకు మరిన్ని రికార్డులు బద్దలు
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడంకెల స్కోరు అందుకున్నాడు కోహ్లీ. ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ విరాట్ కేవలం 85 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వరకు ఆడాడు. అతను తన ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నాడు. విరాట్ కోహ్లీకి కూడా తన ఫిట్‌నెస్ గురించి తెలుసు. వికెట్స్ మధ్య అతను తీసే పరుగులు ఇప్పటికీ అత్యద్భుతంగా ఉంటాయి. ఇదే ఫిట్‌నెస్‌ను కొనసాగించి కోహ్లీ 5, 6 ఏళ్ల పాటు ఆడితే తన బ్యాట్‌తో 27 సెంచరీలు సాధిస్తాడనడంలో సందేహం లేదని సునీల్ గవాస్కర్ అన్నారు.
దాదాపు మూడున్నరేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆ దాహాన్ని తీర్చుకుంటున్నారు. శతకాల మీద శతకాలు కొట్టేస్తున్నాడు.
లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో సెంచరీ బాదిన రన్ మెషిన్ మరోసారి మెరిశాడు. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడంకెల స్కోరు అందుకున్నాడు కోహ్లీ. ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ విరాట్ కేవలం 85 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ సిరీస్‌లో కోహ్లీకిది రెండో సెంచరీ. గౌహతి వేదికగా జరిగిన మొదటి వన్డేలోనూ విరాట్ శతకం బాదాడు. కాగా వన్డే కెరీర్‌లో అతనికిది 46వ సెంచరీ కాగా ఓవరాల్‌గా 74వది. కాగా ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు కోహ్లీ. స్వదేశంలో అత్యధికంగా 21 సెంచరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ 20 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు.
కాగా ఇదే మ్యాచ్ లో మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీ సాధించాడు. మొత్తం 97 బంతుల్లో 116 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. 42 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. కాగా కడపటి వార్తలందే సమయానికి 48 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది టీమిండియా. కోహ్లీ 147 పరుగులతో ఉండగా.. సూర్య 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు.