అక్క క్రికెట్ కిట్‌తో ప్రాక్టీస్.. వీవీఎస్ లక్ష్మణ్ సలహా..శ్వేత తుఫాన్ ఇన్నింగ్స్ వెనక ఆసక్తికర విషయాలివే
ఈ మ్యాచ్‌లో 57 బంతుల్లో 92 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది 18 ఏళ్ల శ్వేతా సెహ్రావత్. ఆమె మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు ఉండడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సఫారీ బౌలర్లపై ఆమె ఏ మేర చెలరేగిందో.

ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిం టీమిండియా యంగ్ క్రికెటర్ శ్వేతా సెహ్రావత్. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఆతిథ్య జట్టుతో తలపడింది భారత మహిళల జట్టు. ఈ మ్యాచ్‌లో సఫారీలు విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించారు భారత అమ్మాయిలు. కాగా ఈ మ్యాచ్‌లో 57 బంతుల్లో 92 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది శ్వేతా సెహ్రావత్. ఆమె మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు ఉండడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సఫారీ బౌలర్లపై ఆమె ఏ మేర చెలరేగిందో. ఆమె ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా ప్రతిష్ఠాత్మక టోర్నీలో అదిరిపోయే శుభారంభం అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేస్తూ శ్వేత ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే శ్వేత రాణించడం వెనక మన హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కృషి కూడా ఉంది. అదేంటంటే.. సుమారు 7 నెలల క్రితం.. అంటే గత ఏడాది మేలో నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కి ఓ లేఖ వచ్చింది. ఆ లెటర్ రాసింది మరెవరో కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న శ్వేతనే.
అక్క కిట్‌తో..
తన 12వ తరగతి పరీక్షలు ఉన్నందు.. అండర్- 19 మహిళల శిక్షణా శిబిరంలో పాల్గొనలేనంటూ ఈ లేఖలో చెప్పుకొచ్చింది శ్వేత. అయితే అప్పటికే ఈ యంగ్ క్రికెటర్ ట్యాలెంట్ గురించి విన్న వీవీఎస్ ఈ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. కనీసం కొన్ని రోజులైన శిక్షణా శిబిరానికి రావాలని ఆమె తండ్రిసంజయ్ సెహ్రావత్ కి లేఖ రాశాడు. దీంతో శ్వేత జూన్ వెంటనే శిక్షణా శిబిరంలో జాయిన్ అయ్యింది. అనుకున్నట్లే ప్రాక్టీస్ చేసింది.గత మ్యాచ్‌లో ఎన్‌సీఏ జోనల్ జట్టు తరఫున ఆడి సెంచరీ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసింది. ఆమె గత 6 మ్యాచ్‌ల్లో మరో 2 సెంచరీలు సాధించడం విశేషం. ఇక 18 ఏళ్ల శ్వేత తండ్రి తన పెద్ద కుమార్తె స్వాతిని మాత్రమే క్రికెట్ క్లబ్‌కు తీసుకెళ్లేవాడట. చిన్న వయసులో క్రికెట్ ఎందుకని ఆమెను ఇంటి దగ్గరే ఉండమనే వారట. అయితే ఒకసారి తన సోదరి శిక్షణ తీసుకుంటున్న క్రికెట్ అకాడమీకి వెళ్లింది శ్వేత. ఆది బాలుర అకాడమీ. అక్కడున్న కోచ్ ఒకరు శ్వేతను బ్యాటింగ్ చేయమన్నాడు. అంతే అకాడమీ ప్లేయర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసి ఆమె సోదరి ఆశ్యర్యపోయింది. మరుసటి రోజే తన క్రికెట్ కిట్ తెచ్చి శ్వేతకు అందజేసింది. అలా తన ప్రయాణం మొదలైంది.




What a game of cricket played by our young women at the #U19WorldCup. An amazing chase and fine innings by Shweta Sehrawat as #TeamIndia started the #U19WorldCup with a massive victory. Congratulations, ladies! @BCCIWomen pic.twitter.com/o4sLW9ojDz
— Jay Shah (@JayShah) January 14, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




