IND vs PAK: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇండో-పాక్ మ్యాచ్‌కు తప్పిన ముప్పు?

ఇండో-పాక్ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి దాదాపు 70 మిలియన్ డాలర్లు అంటే రూ. 581 కోట్ల నష్టం వాటిల్లుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై నిరాశపడిన ఫ్యాన్స్‌కు శుభవార్తలా మారింది.

IND vs PAK: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇండో-పాక్ మ్యాచ్‌కు తప్పిన ముప్పు?
India Vs Pak
Follow us
Venkata Chari

|

Updated on: Oct 22, 2022 | 1:46 PM

ఆదివారం మెల్‌బోర్న్‌లో జరగనున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై వర్షం కరుణించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానుల కోరిక నెరవేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మెల్‌బోర్న్‌లోని వాతావరణంలో కీలక మార్పులు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 23) న జరగనున్న బ్లాక్‌బస్టర్ IND vs PAK ICC T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ కోసం వాతావరణ సూచన నాటకీయంగా మెరుగుపడింది. శనివారం ఉదయం నుంచి వర్షం కురవకపోవడంతో వాతావరణం బాగానే ఉందని తెలుస్తోంది. ఈ వార్త మెల్‌బోర్న్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఎంతో సంతోషాన్ని అందించింది. IND vs PAK మ్యాచ్‌కు 60% వర్షం పడే అవకాశం ఉందని ఆస్ట్రేలియా MET విభాగం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు మెల్‌బోర్న్‌లో వాతావరణం బాగానే ఉందని తెలిపింది.

స్థానిక నివేదికల ప్రకారం, ఇండో-పాక్ మ్యాచ్ రద్దు అయితే, ఐసీసీకి దాదాపు 70 మిలియన్ డాలర్లు అంటే రూ. 581 కోట్ల నష్టం వాటిల్లుతుంది. టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ మ్యాచ్‌ కంటే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు జారీ చేసిన వెంటనే అమ్ముడయ్యాయి. అయితే ఫైనల్ టిక్కెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ఊహించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తీవ్రంగా చెమటలు చిందిస్తోన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు..

గ్రేట్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు చెమటోడ్చింది. ఆటగాళ్లు వర్షం గురించి అస్సలు ఆలోచించడం లేదు. ముమ్మరంగా సిద్ధమవుతున్నారు. ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ శనివారం విడుదల చేసింది.

IND vs PAK: T20 ప్రపంచ కప్ 2021 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ 5, పాకిస్థాన్‌ 1 విజయాలను నమోదు చేశాయి.

2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఎదురైన ఏకైక ఓటమి.

బాబర్ అజామ్ నేతృత్వంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. మెల్‌బోర్న్‌లోని MCGలో భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కూడా ఓడిపోయింది.

ఈసారి, మెన్ ఇన్ బ్లూ T20 ప్రపంచ కప్‌లలో విజయం సాధించి తన విజయాల సంఖ్యను 6 చేర్చాలని చూస్తోంది.

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!