T20 World Cup: 7 ఫోర్లు, 2 సిక్సులు.. తుపాన్ వేగంతో 92 పరుగులు.. ఆస్ట్రేలియా పేస్ దళాన్ని చితక్కొట్టిన బ్యాటర్..

AUS vs NZ: డేవాన్ కాన్వే చివరి 5 ఇన్నింగ్స్‌లలో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో పాకిస్థాన్‌‌తో పాటు ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్లను కూడా చితక్కొట్టాడు.

T20 World Cup: 7 ఫోర్లు, 2 సిక్సులు.. తుపాన్ వేగంతో 92 పరుగులు.. ఆస్ట్రేలియా పేస్ దళాన్ని చితక్కొట్టిన బ్యాటర్..
Devon Conway
Follow us
Venkata Chari

|

Updated on: Oct 22, 2022 | 4:07 PM

T20 ప్రపంచ కప్ 2022 మొదటి సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను దారుణంగా ఉతికి ఆరేశారు. ఓపెనర్ డెవాన్ కాన్వే తన బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేశాడు. ఓపెనర్ కాన్వే 92 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 58 బంతుల్లో ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని తిప్పికొట్టాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్‌లతో కూడిన బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొన్నాడు. కాన్వే తుఫాను ఇన్నింగ్స్‌లో కేవలం ఫోర్లు, సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. 92 పరుగుల ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

కాన్వే వేగంగా బ్యాటింగ్ చేయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. కాన్వే 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఊపు చూస్తే.. సెంచరీ పూర్తి చేస్తాడేమో అనిపించింది. కానీ, సెంచరీ పూర్తికాకముందే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది.

5 ఇన్నింగ్స్‌ల్లో మూడో అర్ధశతకం..

ఇవి కూడా చదవండి

గత 5 ఇన్నింగ్స్‌ల్లో డేవాన్ కాన్వే మూడో అర్ధ సెంచరీ చేశాడు. ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో 70 నాటౌట్, ఆ తర్వాత పాకిస్థాన్‌పై 49 నాటౌట్, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో 64 పరుగులు చేశాడు.

తొలి 4 ఓవర్లలో 56 పరుగులు..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే, మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీ జట్టుకు ఫిన్ అలెన్, కాన్వే అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. వారిద్దరూ కలిసి 4 ఓవర్లలో 56 పరుగులు పిండుకున్నారు. అయితే 5వ ఓవర్ మొదటి బంతికి అలెన్ 42 పరుగులు చేశాడు. 16 బంతుల్లో అవుట్ అయ్యాడు. దీని తర్వాత కాన్వేకి కెప్టెన్ కేన్ విలియమ్సన్ మద్దతు లభించింది.

కాన్వే తుఫాన్ హాఫ్ సెంచరీ..

కాన్వాయ్ తన స్పీడ్ పెంచి ముందుకు సాగి లాంగ్ షాట్‌లు కొట్టాడు. చివరిసారి రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 125 పరుగుల స్కోరు వద్ద రెండో దెబ్బ తగిలింది. కెప్టెన్ జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత, గ్లెన్ ఫిలిప్ కాన్వేకు మద్దతు ఇచ్చాడు. కానీ, ఫిలిప్ రూపంలో న్యూజిలాండ్ 16వ ఓవర్ చివరి బంతికి 152 పరుగులకు నాల్గవ దెబ్బను అందుకుంది.

చివరి 4 ఓవర్లలో విధ్వంసం..

కాన్వే, జిమ్మీ నీషమ్ చివరి 4 ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. న్యూజిలాండ్ స్కోర్‌ను 200 పరుగులకు చేర్చడానికి మరో 48 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, ఆడమ్ జంపా అద్భుత ప్రదర్శన చేశాడు.

ఇరు జట్ల ప్లేయింగ్ XI..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే(w), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!