సుమారు 1,330 రోజుల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన వాషింగ్టన్ సుందర్.. టీమ్ మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు వాషింగ్టన్ సుందర్ చెలరేగిపోయాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ నడ్డీ విరిచాడు. ఫలితంగా భారీ స్కోరు చేస్తుందనుకున్న కివీస్ కేవలం 259 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు సుందర్‌కు ఆర్ అశ్విన్ అద్భుతమైన సహకారం అందించాడు. మూడు వికెట్లతో కివీస్ టాపార్డర్ పని పట్టాడు. ఇప్పుడు భారత బౌలర్ల తర్వాత భారీ ఆధిక్యం సాధించాల్సిన బాధ్యత బ్యాటర్లదే. పుణే వేదికగా జరుగుతోన్న ఈ టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులాగే రెండో టెస్టులోనూ కివీస్‌కు శుభారంభం లభించింది. అయితే కెప్టెన్ టామ్ లాథమ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడలేక కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడో స్థానంలో వచ్చిన విల్ యుంగ్ కూడా 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత కలిసి వచ్చిన కాన్వే, రచిన్ రవీంద్ర జోడీ భారత బౌలర్లను ఇబ్బంది పెట్టింది. అయితే అశ్విన్ స్పిన్ వలలో చిక్కుకున్న కాన్వే 76 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఆ తర్వాత డారెల్ మిచెల్ పెద్దగా ఇన్నింగ్స్ ఆడకపోయినా, క్రీజులో కుదురుకున్న రవీంద్రకు చక్కటి సహకారం అందించాడు. ఈ టెస్టులోనూ సెంచరీ వైపు సాగుతున్న రవీంద్ర ను సుందర్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. రవీంద్ర ఔటైన తర్వాత కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒకానొకదశలో 197 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన కివీస్ 62 పరుగుల గ్యాప్‌లో మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. లోయర్ ఆర్డర్ లో ధాటిగా బ్యాటింగ్ చేసిన మిచెల్ సాంట్నర్ జట్టుకు కీలకమైన 33 పరుగులు అందించాడు.
Innings Break!
Superb bowling display from #TeamIndia! 💪
7⃣ wickets for Washington Sundar
3⃣ wickets for R AshwinScorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @Sundarwashi5 | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/TsWb5o07th
— BCCI (@BCCI) October 24, 2024
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐజాజ్ పటేల్, విలియం ఓ’రూర్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..