Video: నన్ను నమ్మండి రోహిత్ భయ్.. అది పక్కా ఔట్.. డీఆర్‌ఎస్ తీసుకో.. సంచలనంగా మారిన సర్ఫరాజ్ వీడియో

Sarfaraz Khan convinces Rohit Sharma: పూణె టెస్టులో విల్ యంగ్ వికెట్ అశ్విన్ ఖాతాలోకి వెళ్లినా.. అది సర్ఫరాజ్ ఖాన్ పడగొట్టాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, సర్ఫరాజ్ నమ్మకంతోనే రోహిత్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. అందరికీ నమ్మకం లేదు. కానీ, సర్ఫరాజ్ రోహిత్‌ను ఒప్పించి మరీ వికెట్ పడగొట్టాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో కనిపించింది.

Video: నన్ను నమ్మండి రోహిత్ భయ్.. అది పక్కా ఔట్.. డీఆర్‌ఎస్ తీసుకో.. సంచలనంగా మారిన సర్ఫరాజ్ వీడియో
Sarfaraz Khan Convinces Roh
Follow us
Venkata Chari

|

Updated on: Oct 24, 2024 | 1:44 PM

సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఈ యంగ్ ప్లేయర్.. తాజాగా రోహిత్‌ను డీఆర్‌ఎస్‌కు ఒప్పించిన తీరుతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. పూణె టెస్టులో బంతి కూడా పట్టకుండా భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు. అయితే ఆ వికెట్ అశ్విన్ ఖాతాలోకి వెళ్లినా సర్ఫరాజ్ ఖాన్ సమయస్ఫూర్తికి అంతా ఫిదా అవుతున్నారు. సర్ఫరాజ్ కారణంగా అశ్విన్, టీమ్ ఇండియాకు లభించిన వికెట్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ విల్ యంగ్‌ది కావడం విశేషం. ఈ వికెట్‌తో పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు కూడా రెండో దెబ్బ తగిలింది.

బంతిని కూడా పట్టుకోకుండా సర్ఫరాజ్ వికెట్ తీసిన సర్ఫరాజ్..

ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో సర్ఫరాజ్ బంతిని కూడా పట్టుకోకుండా భారత్‌కు ఎలా వికెట్ అందిచాడో ఇప్పుడు చూద్దాం. అశ్విన్ వేసిన ఈ ఓవర్ చివరి బంతి దాని లైన్ నుంచి కాస్త పక్కకు తప్పుకున్నట్లు అనిపించింది. మిడిల్ స్టంప్‌ను తాకడంతో బంతి లెగ్ సైడ్ వైపు వెళ్లింది. విల్ యంగ్ ఒక ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ, మిస్ అయ్యాడు. దీంతో బాల్ నేరుగా వెళ్లి పంత్ చేతిలో పడింది. దీంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్‌ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

DRS కోసం రోహిత్‌ను ఒప్పించిన సర్ఫరాజ్..

అంపైర్ నిరాకరించడంతో, సర్ఫరాజ్ ఖాన్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ వద్ద నిలబడి, కెప్టెన్ రోహిత్ శర్మను DRS తీసుకోవాలని కోరాడు. సర్ఫరాజ్ తన అభిప్రాయాలను రోహిత్‌కి అందించిన తీరు, అతని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. బంతి బ్యాట్‌కి తగిలిందని, తాను చూశానని రోహిత్‌కి చెబుతున్నాడు. రోహిత్‌ను ఒప్పించడంలో సర్ఫరాజ్‌కు విరాట్ మద్దతు కూడా లభించింది. రోహిత్ ఎట్టకేలకు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసి డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. సర్ఫరాజ్ చెప్పినట్లే జరిగింది. మైదానంలోని అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. విల్ యంగ్ పెవిలియన్‌కు వెళ్లవలసి వచ్చింది.

సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రస్తుతం అంతా బాగానే ఉంది. తన మొదటి టెస్ట్ సెంచరీని స్కోర్ చేయడంతోపాటు ఆవెంటనే బిడ్డ పుట్టడం.. ఇప్పుడు ఇలాంటి తెలివైన నిర్ణయంతో ప్రస్తుతం సెన్షెషన్‌గా మారాడు. టీమ్ ఇండియాకు విల్ యంగ్ వికెట్ ఇవ్వడం ద్వారా న్యూజిలాండ్‌కు రెండవ దెబ్బ రుచిచూపించాడు.

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..