IND vs NZ: టీమిండియా కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం.. లేకుంటే బెంగళూరులో కథ వేరేలా ఉండేది

|

Oct 20, 2024 | 4:57 PM

మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లిపోయింది న్యూజిలాండ్ జట్టు. సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. కాబట్టి ఈ ఓటమి నుంచి టీమిండియా త్వరగా కోలుకోవాలి. 24 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో సత్తా చాటాలి. లేకుంటై డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి.

IND vs NZ: టీమిండియా కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం.. లేకుంటే బెంగళూరులో కథ వేరేలా ఉండేది
Team India
Follow us on

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది . ఈ ఓటమికి ప్రధాన కారణం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న ఒకే ఒక నిర్ణయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవును, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందన్న అతి విశ్వాసం భారత్‌కు ఉంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కేవలం 46 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. అయితే మ్యాచ్ మధ్యలో మళ్లీ వర్షం పడే సూచన ఉన్నా రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అంత కంటే ముందే ఇదే వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు నాలుగో ఇన్నింగ్స్ వరంలా మారింది. రెండు రోజుల మ్యాచ్‌లు వర్షం పడినప్పటికీ, టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వర్షం ప్రభావిత మ్యాచ్‌లో ఇంతటి విజయం సాధించడమే తాజా ఉదాహరణ. అయితే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన నిర్ణయం భారత జట్టు ఓటమికి దారి తీసిందని పలువురు మాజీ లు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన న్యూజిలాండ్‌ 402 పరుగులకు ఆలౌటైంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 462 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఐదో రోజు ఆటలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కివీస్.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..