- Telugu News Photo Gallery Cricket photos Indian Cricketer Sanju Samson shares birthday post for wife Charulatha Remesh
Sanju Samson: భార్యకు క్యూట్‌గా బర్త్ డే విషెస్ చెప్పిన సంజూ శామ్సన్.. జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారో! ఫొటోస్
టీమిండియా యంగ్ క్రికెటర్ సంజూ శామ్సన్ ఇటీవలే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మెరుపు సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లో 111 రన్స్ కొట్టాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం.
Updated on: Oct 20, 2024 | 3:15 PM

టీమిండియా ట్యాలెంటెడ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంజూ శామ్సన్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ విషయాలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేసుకుంటూ ఉంటాడు.

ఇదిలా ఉంటే శనివారం ( అక్టోబర్ 19) సంజూ సతీమణి చారులత రమేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యకు క్యూట్ గా బర్త్ డే విషెస్ చెప్పాడీ హ్యాండ్సమ్ క్రికెటర్.

తన భార్యతో కలిసున్న అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సంజూ శామ్సన్ ‘నా అందమైన ఇంపాక్ట్ ప్లేయర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని క్రికెట్ పరిభాషలో విషెస్ చెప్పాడు.

దీంతో సంజూ శామ్సన్ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు చారులతకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు

కేరళకు చెందిన సంజూ శాంసన్ 2018లో తన స్నేహితురాలు చారులతా రమేశ్‌ను పెళ్లాడాడు. ఇక సంజూ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌తో బిజీగా ఉన్నాడు




