IND vs NZ: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్.. ఆరు వికెట్లు డౌన్.. పంత్‌పైనే ఇక ఆశలన్నీ
టీమిండియా ఆట తీరు ఏ మాత్రం మారలేదు. టర్నింగ్ పిచ్ పై మన బ్యాటర్లు ఘోరంగా తడబడుతున్నారు. ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లోనూ ఇది మరోసారి నిరూపితమైంది.
న్యూజిలాండ్ స్పిన్నర్లను ఎదుర్కొలేక మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే టీమిండియా కుప్పకూలింది. అయితే బౌలర్ల పుణ్యమా అని న్యూజిలాండ్ ను రెండో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో భారత్ విజయానికి 147 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలోనూ టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ స్నినర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. ఫలితంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి టీమింఇయా ఆరు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. భారత జట్టు విజయానికి మరో 55 పరుగులు కావాల్సి ఉంది. పంత్(53), వాషింగ్టన్ సుందర్(6) క్రీజ్‌లు ఉన్నారు. అంతుకు ముందు రోహిత్ శర్మ (11), గిల్(1), కోహ్లీ(1), జైశ్వాల్(5), సర్ఫరాజ్ ఖాన్(1), జడేజా(6) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235, భారత్ 263 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌటైంది.
కాగా మొదటి ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ సాధించిన రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ తో టీమిండియాను . 48 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగుల మార్కుకు చేరుకున్నాడు. ఇప్పుడు టీమ్ ఇండియా గెలుపు ఆశలన్నీ పంత్ పైనే ఉన్నాయి.
పంత్ అర్ధ సెంచరీ..
Rishabh Pant leads #TeamIndia‘s fightback with a sensational fifty 🔥
Watch the 3rd #INDvNZ Test as #TeamIndia chase victory, LIVE on #JioCinema, #Sports18 and #ColorsCineplex 👈#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/9sLLVmfSNV
— JioCinema (@JioCinema) November 3, 2024
భారత్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఓ రూర్క్.
Gill castled 💥
Watch Day 3 LIVE on #JioCinema #Sports18 & ColorsCineplex👈#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/HTdvnvcrdq
— JioCinema (@JioCinema) November 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..