IND vs ENG: ఓటమి బాధలో ఉన్నభారత జట్టుకు ఎదురుదెబ్బ.. బుమ్రాకు ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణమిదే
హైదరాబాద్ టెస్టులో టీమిండియా ఓటమి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన నిరాశకు గురిచేసిందంటూ మాజీ ప్లేయర్లు, క్రికెట్ నిపుణులు రోహిత్ సేనపై విమర్శలు చేస్తున్నారు. అసలే ఓటమి పరాజయంతో ఉన్న టీమిండియాకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి

హైదరాబాద్ టెస్టులో టీమిండియా ఓటమి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన నిరాశకు గురిచేసిందంటూ మాజీ ప్లేయర్లు, క్రికెట్ నిపుణులు రోహిత్ సేనపై విమర్శలు చేస్తున్నారు. అసలే ఓటమి పరాజయంతో ఉన్న టీమిండియాకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. మొదటి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ ఫాస్ట్ బౌలర్ జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన ఓలీ పోప్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు బుమ్రాపై చర్యలకు ఉపక్రమించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకుశిక్షగా బుమ్రాకు ఒక డీమెరిట్ పాయింట్, అలాగే మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించబడింది. జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినట్లు ఐసీసీ తెలిపింది. అంటే మైదానంలోని అంపైర్, మ్యాచ్ రెఫరీ లేదా ఇతరులతో ఢీకొట్టడం లేదా అనుచితంగా ప్రవర్తించినందుకన్నమాట.
వివరాల్లోకి వెళితే,..
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81వ ఓవర్ వేయడానికి జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. ఇదే ఓవర్‌లో సెంచరీ వీరుడు ఓలీ పోప్ పరుగు తీస్తున్న సమయంలో సమయంలో బుమ్రా కావాలనే అతనికి అడ్డుగా వెళ్లినట్లు, పోప్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించాడని అంపైర్లు గుర్తించారు. .ఇది ఐసిసి నిబంధనలకు విరుద్ధం. అయితే గత 24 నెలల్లో బుమ్రా ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కావడంతో ఐసీసీ తక్కువ శిక్ష, జరిమానాతో వదిలేసింది.
The Code of Conduct breach occurred during the fourth day of #INDvENG first Test in Hyderabad 👀
Details 👇https://t.co/PPjnAhcBAY
— ICC (@ICC) January 29, 2024
బుమ్రా తప్పు ఒప్పుకోవడంతో..
బుమ్రాపై ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫిల్, క్రిస్ గాఫ్నీ, థర్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్చ ఫోర్త్ అంపైర్ రోహన్ పండిట్ ఆరోపణలు చేశారు. ICC ప్రవర్తనా నియమావళి యొక్క లెవల్ 1 ఉల్లంఘన సాధారణంగా అధికారికంగా మందలింపు, ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లకు దారి తీస్తుంది. తదనుగుణంగా, బుమ్రా తన తప్పును అంగీకరించాడు ఎమిరేట్స్ ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన రిచీ రిచర్డ్సన్ విధించిన పెనాల్టీని కూడా అంగీకరించాడు. అందువల్ల ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








