ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఏర్పాట్లను అపెక్స్ కొన్సిల్ సభ్యులతో కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు గురువారం పరిశీలించారు. స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ సంబంధిత పనులన్నింటిని స్వయంగా పర్యవేక్షించారు. పిచ్, మైదానం అవుట్ ఫీల్డ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులందరూ పూర్తి సమయం స్టేడియంలోనే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకుల సౌకర్యార్థం డే టైమ్‌లో ఎండ తగలకుండా రూఫ్ టాప్ పనులు, కొత్త సీట్ల ఏర్పాటును సకాలంలో పూర్తి చేశామన్నారు. ఆటగాళ్ల డ్రెసింగ్ రూమ్స్, ఇతర ఆధునీకరణ, మరమ్మతు పనులు, శానిటేషన్ వర్క్స్ కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
టెస్టు మ్యాచ్ వీక్షణకు ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ గుర్తింపు గల స్కూల్స్ విద్యార్థులను ఉచితంగా అనుమతించేందుకు ఒక గైడ్‌లైన్స్ రూపొందించామని జగన్‌మోహన్ రావు చెప్పారు. విద్యార్థులను నేరుగా అనుమతించమని, స్కూల్ ప్రిన్సిపాల్స్ చేసిన ధరఖాస్తుల ఆధారంగానే కాంప్లిమెంటరీ పాసులు ఆయా పాఠశాలలకు అందిస్తామని స్పష్టం చేశారు. ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులనే అనుమతిస్తామని, విద్యార్థులు స్కూల్ యూనిఫారమ్స్ వేసుకుని రావాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత భోజన, తాగునీరు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం ఈనెల 18 లోపు హెచ్‌సీఏ సీఈఓ ఈమెయిల్ ఐడీ (ceo.hydca@gmail.com)కి విద్యార్థులు, స్టాఫ్ ఎంత మంది వస్తున్నారో, వారి సంఖ్య, పేర్లను స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పంపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షులు దల్జీత్ సింగ్, కార్యదర్శి దేవ్‌రాజ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు, కౌన్సిలర్ సునిల్ కుమార్, సీఈఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Good move from Hyderabad Cricket Association to provide free entry to Govt school students (Class 6-12) for the 1st Test to be held in Hyderabad from 25th Jan.
Most of them come from humble beginnings and would have never been to a cricket game. Tq @JaganMohanRaoA garu#IndvENG
— Sunrisers Army (@srhorangearmy) January 10, 2024
Hyderabad Cricket Association has invited Telangana government school class VI to XII students to watch India Vs England Test match in Hyderabad for free.
Free lunch will also be provided to them. All student must wear the uniform. #INDvsENG pic.twitter.com/AvAHrFw0pK
— Himanshu Pareek (@Sports_Himanshu) January 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..