Telugu News Sports News Cricket news IND vs ENG: All Rounder Ravindra Jadeja takes 2 Stunning catches in an over of Hardik Pandya in 3rd ODI Telugu Cricket News
IND vs ENG: క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్న మాట క్రికెట్లో ఎప్పటినుంచో ఉంది. దీనికి తగ్గట్టే ప్రతిజట్టు తమ ఫీల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈక్రమంలో కళ్లుచెదిరే క్యాచ్‌లు, ఫీల్డింగ్‌లో చిరుతపులిలా కదులుతూ ప్రత్యర్థులను పెవిలియన్‌కు పంపే ఆటగాళ్లు కొందరే ఉంటారు..
IND vs ENG: క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్న మాట క్రికెట్లో ఎప్పటినుంచో ఉంది. దీనికి తగ్గట్టే ప్రతిజట్టు తమ ఫీల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈక్రమంలో కళ్లుచెదిరే క్యాచ్‌లు, ఫీల్డింగ్‌లో చిరుతపులిలా కదులుతూ ప్రత్యర్థులను పెవిలియన్‌కు పంపే ఆటగాళ్లు కొందరే ఉంటారు. అలాంటివారిలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒకరు. అతను ఎలాంటి ఫీల్డర్అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మెరుపు ఫీల్డింగ్‌తో పలుమార్లు రనౌట్లు.. మరి కొన్నిసార్లు అద్బుత క్యాచ్‌లు అందుకున్నాడు. ప్రపంచంలో ది బెస్ట్ ఫీల్డర్‌గా ముద్రపడిన జడ్డూ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మరోసారి ఫీల్డింగ్‌లో తన విన్యాసాలు రుచి చూపించాడు. అది కూడా ఓకే ఓవర్‌లోనే. ఇక ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) క్యాచ్ అయితే మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పవచ్చు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలో వికెట్లు తీసినప్పటికీ కెప్టెన్ బట్లర్,మొయిన్ అలీ, లివింగ్ స్టోన్‌లు భారత బౌలర్లను ప్రతిఘటించారు. ముఖ్యంగా బట్లర్, లివింగ్ స్టోన్ వేగంగా పరుగులు చేస్తూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. ఈక్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ మరింత ధాటిగా ఆడడం మొదలెట్టాడు. లివింగ్‌స్టోన్ కూడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి భాగస్వామ్యం కాసేపు భారత అభిమానులను కలవరపెట్టింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆల్‌రౌండర్ హార్ధిక్ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్‌లో ఒక భారీ సిక్సర్ బాదిన లివింగ్ స్టోన్ మరోసారి అలాగే బంతిని బలంగా బాదాడు. అది కూడా నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లేలా కనిపించింది. అయితే బౌండరీ దగ్గరే కాచుకుని ఉన్న జడ్డూ కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో లివింగ్‌స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇక తర్వాతి వంతు బట్లర్‌ది. పాండ్యా షార్ట్ పిచ్ బాల్ వేయగా.. బట్లర్ డీప్‌స్వ్కేర్ లెగ్ మీదుగా భారీషాట్ ఆడాడు. బౌండరీ అనుకున్న తరుణంలో దాదాపు 25 గజాల దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన జడేజా మొత్తం ఎడమవైపునకు తిరిగి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. ఇలా ఓకే ఓవర్‌లో జడ్డూ పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌ను టీమిండియా వైపు మలుపుతిప్పాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.