IND vs ENG 4th Test: ధోని ఇలాఖాలో 4వ టెస్ట్.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. సమం చేసే దిశగా ఇంగ్లండ్..
India vs England 4th Test: ఇంగ్లండ్‌తో ఆదివారం రాజ్‌కోట్‌లో ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ 434 పరుగులతో రికార్డు విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు నాలుగో టెస్టు మ్యాచ్‌పై ఇరు జట్లూ కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా విధించింది. అయితే, భారత్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ 122 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ సేన 434 పరుగులతో రికార్డు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ రెచ్చిపోతే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తన సత్తా చాటాడు.

IND vs ENG 4th Test: రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును ఓడించి నాలుగో రోజు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా విధించింది. అయితే, భారత్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ 122 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ సేన 434 పరుగులతో రికార్డు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ రెచ్చిపోతే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తన సత్తా చాటాడు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాబట్టి, భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు?
ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 27 వరకు భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు.
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ JioCinema యాప్‌లో అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు సిరీస్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ IST ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
🚨 𝙍𝙚𝙘𝙤𝙧𝙙 𝘼𝙡𝙚𝙧𝙩! 🚨
With a winning margin of 434 runs in Rajkot, #TeamIndia register their biggest Test victory ever 👏🔝
A historic win courtesy of some memorable performances 👌👌
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nXbjlAYq7K
— BCCI (@BCCI) February 18, 2024
భారత టెస్టు జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఎమర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్. జో రూట్, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




