IND vs BAN: తన ఫేవరేట్ ప్లేయర్‌కే హ్యాండిచ్చిన గంభీర్.. టెస్ట్ కెరీర్ ముగిసినట్లే?

Shreyas Iyer Dropped from Team India Test Squad: భారత జట్టు ఈ నెల నుంచి తిరిగి మైదానంలోకి రాబోతోంది. శ్రీలంక టూర్‌లో టీం ఇండియా తన చివరి సిరీస్‌ను ఆడింది. అప్పటి నుంచి సుదీర్ఘ విరామంలో ఉంది. అయితే, ఇప్పుడు సెప్టెంబర్ 19 నుంచి సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. 16 మంది ఆటగాళ్లకు చోటు కల్పించిన ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు భారత జట్టును కూడా బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.

IND vs BAN: తన ఫేవరేట్ ప్లేయర్‌కే హ్యాండిచ్చిన గంభీర్.. టెస్ట్ కెరీర్ ముగిసినట్లే?
Shreyas Iyer, Gautam Gambhi
Follow us
Venkata Chari

|

Updated on: Sep 09, 2024 | 5:25 PM

Shreyas Iyer Dropped from Team India Test Squad: భారత జట్టు ఈ నెల నుంచి తిరిగి మైదానంలోకి రాబోతోంది. శ్రీలంక టూర్‌లో టీం ఇండియా తన చివరి సిరీస్‌ను ఆడింది. అప్పటి నుంచి సుదీర్ఘ విరామంలో ఉంది. అయితే, ఇప్పుడు సెప్టెంబర్ 19 నుంచి సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. 16 మంది ఆటగాళ్లకు చోటు కల్పించిన ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు భారత జట్టును కూడా బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. యశ్ దయాల్‌కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం లభించగా, మరో 15 మంది ఆటగాళ్లను కూడా ఇంతకు ముందే ఎంపిక చేశారు. అయితే, కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సన్నిహితుడైన శ్రేయాస్ అయ్యర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

కొంతమంది ఆటగాళ్ళు దులీప్ ట్రోఫీ 2024లో వారి మంచి ప్రదర్శనకు రివార్డ్ పొందారు. కానీ, కొందరు నిరాశ చెందారు. అతని స్థానం ప్రమాదంలో ఉందని శ్రేయాస్ అయ్యర్ గురించి చాలా చర్చ జరిగింది. అయితే, అతను దులీప్ ట్రోఫీలో తన రెండవ ఇన్నింగ్స్‌లో 54 పరుగుల దూకుడు ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి తిరిగి వచ్చే సంకేతాలను చూపించాడు. కానీ, ఈ ప్రదర్శనతో సెలెక్టర్లను మెప్పించలేకపోయాడు. అందుకే కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి బ్యాట్స్‌మెన్లు చోటు సంపాదించగలిగారు. స్వ్కాడ్ నుంచి శ్రేయాస్ బయటకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

శ్రేయాస్ అయ్యర్ టెస్టు కెరీర్ ముగిసిపోతుందా?

శ్రేయాస్ అయ్యర్ టీ20 అంతర్జాతీయ కెరీర్ ఇప్పటికే ప్రమాదంలో పడింది. మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అతనికి టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో చోటు ఇవ్వలేదు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్‌తో కలిసి మెంటార్‌గా పనిచేసిన గంభీర్ కోచ్ అయిన తర్వాత తన కెరీర్‌కు మద్దతు ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ, ఇప్పటి వరకు అది కనిపించలేదు. గంభీర్‌ను ఇప్పటికే టీ20 జట్టు నుంచి పక్కనపెట్టి శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అదే సమయంలో, ఇప్పుడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్ బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుకు కూడా ఎంపిక కాలేదు.

2021లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన టెస్ట్ అరంగేట్రం చేసి సెంచరీ చేయడం ద్వారా ఘనంగా మొదలుపెట్టాడు. అయితే, అయ్యర్ తన కెరీర్‌లో మంచి ప్రారంభాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా ఫ్లాప్ అయ్యాడు. ఇంగ్లాండ్‌పై అతని ప్రదర్శన కూడా ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు, పునరాగమనం చేయడానికి, అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో చాలా పటిష్టంగా రాణించవలసి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..