Sabarimala temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. మండల మకరవిళక్కు సీజన్‌లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.
మండల మకరవిళక్కు సీజన్‌లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. తొలిరోజు పంపా నది తీరం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లారు. ఇరుముడులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.ఈ సీజన్‌లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రతిరోజు18 గంటల పాటు అనుమతిచ్చామంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పస్వామిని దర్శించునే అవకాశం కల్పించారు. మండల సీజన్ డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. వచ్చేనెల 30 నుంచి మొదలయ్యే మకరవిళక్కు సీజన్ 2025 జనవరి 20 వరకు కొనసాగుతుంది. అప్పుడు కూడా మండల దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వాములు భారీగా తరలివస్తారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్‌లు నవంబర్ 29 వరకు పూర్తిగా రిజర్వ్ చేయబడతాయని దేవస్వోమ్ బోర్డు తెలిపింది. ప్రతిరోజూ 70,000 మంది భక్తులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా తమ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ స్లాట్‌ను పొందలేని వారికి వసతి కల్పించడానికి, ప్రతిరోజూ అదనంగా 10,000 మంది భక్తుల కోసం స్పాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. కేవలం సంప్రదాయ ఇరుముడ్కెట్టుతో శబరిమలకు వచ్చే భక్తులెవరూ దర్శనం లేకుండా వెనుదిరిగి వెళ్లకుండా చూస్తామని దేవస్వోమ్ బోర్డు ప్రతినిధులు హామీ ఇచ్చారు. రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే, పరిస్థితిని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను అమలు చేస్తామని వారు పేర్కొన్నారు.
వీడియో:
రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లోని శబరిమలతో సహా పలు ఆలయాలను నిర్వహిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్‌బోర్డు (టీడీబీ) శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి యాత్రికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. సాయంత్రం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచినప్పుడు వచ్చే ఏడాది ఆలయ అర్చకుల మార్పు జరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..