AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Maori Haka: మళ్లీ వార్తల్లోకి న్యూజిలాండ్ యంగ్ ఎంపీ.. పార్లమెంటులోనే బిల్లు చింపేసి డ్యాన్స్

న్యూజిలాండ్‌లోని అతి పిన్న వయస్సు గల మావోరీ ఎంపీ హనా-రౌహితీ కరేరికి మైపీ-క్లార్క్ గురువారం పార్లమెంట్‌లో సంప్రదాయ హాకా నృత్యం చేస్తూ బిల్లు కాపీని చించివేశారు. ఆ తర్వాత సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

MP Maori Haka: మళ్లీ వార్తల్లోకి న్యూజిలాండ్ యంగ్ ఎంపీ.. పార్లమెంటులోనే బిల్లు చింపేసి డ్యాన్స్
New Zealand Youngest MP Maori Haka Dance In Parliament Video Goes Viral
Velpula Bharath Rao
|

Updated on: Nov 15, 2024 | 11:58 PM

Share

న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్సు గల ఎంపీ హనా రీతి మైపి క్లార్క్ గురించి ఈ రోజుల్లో చాలా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఆమె మళ్లీ పార్లమెంట్‌లో వివాదాస్పద ప్రదర్శన చేశారు. 22 ఏళ్ల హనా మావోరీ తెగకు చెందినది. మావోరీ సంస్కృతికి సంబంధించిన ‘హాకా’ నృత్యం చేస్తూ పార్లమెంటులో ‘స్వదేశీ ఒప్పంద బిల్లు’ కాపీని చించివేసింది. దీని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో హాకా డ్యాన్స్ చేస్తూ బిల్లు కాపీని చింపివేస్తున్నట్లు కనిపించింది.

వాస్తవానికి, వివాదానికి కారణం 1840 నాటి వైతాంగి ఒప్పందానికి సంబంధించిన సూత్రాలు, దీని ప్రకారం మావోరీ తెగలు బ్రిటిష్ పాలనను అంగీకరించడానికి బదులుగా వారి భూమి మరియు హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత బిల్లు పౌరులందరికీ సమాన సూత్రాలను వర్తింపజేయాలని కోరింది. ఇది స్థానిక హక్కుల ఉల్లంఘనగా మావోరీ నాయకులు భావిస్తారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, పార్లమెంట్‌లో హనా నిరసనకు గ్యాలరీలో కూర్చున్న ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. దీంతో బిల్లుపై పార్లమెంటులో పెద్ద గందరగోళం జరిగింది. దీంతో స్పీకర్ సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. బిల్లును వ్యతిరేకించే వారు జాతి విద్వేషాలు మరియు రాజ్యాంగ తిరుగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.

వీడియో  ఇదిగో:

ఇది చదవండి:

ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయి.. కట్ చేస్తే.. పోకిరి లెవల్ ట్విస్ట్

అప్పుడు మొదటి ప్రసంగంలో హాకా నృత్యం

హానా తన హాకా డ్యాన్స్ ద్వారా హెడ్‌లైన్స్‌లో ఉండటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు, ఆమె ఎన్నికల్లో గెలిచి, పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో హాకా చేయడంతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు.

హాకా నృత్యం అంటే ఏమిటి?

హాకా సాధారణ నృత్యం కాదు. వీడియోలో చూసినట్లుగా, మావోరీ తెగ వారు పూర్తి శక్తితో, వ్యక్తీకరణలతో ప్రదర్శించిన పురాతన యుద్ధ నృత్యం ఇది. ఈ నృత్యం మావోరీ తెగ గర్వించదగిన చరిత్ర, బలం, ఐక్యతగా ప్రదర్శస్తూ ఉంటారు.

ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మావోరీ హక్కులను కూల్చివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అతని ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శకులు చాలా వస్తున్నాయి.  టైమ్ మ్యాగజైన్ నివేదించిన స్థానిక వార్తా పోల్ ప్రకారం, కొన్ని కఠినమైన విధానాల కారణంగా లక్సన్ ప్రజాదరణ గణనీయంగా తగ్గిన్నట్లు తెలుస్తుంది. ‘స్వదేశీ ఒప్పంద బిల్లు’ పై దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి