SA vs IND: సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.

SA vs IND: సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Nov 15, 2024 | 10:52 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరిదైన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. సంజు శాంసన్‌ ( 56 బంతుల్లో 109 నాటౌట్; 8 సిక్స్‌లు; 6 ఫోర్లు), తిలక్‌వర్మ ( 47 బంతుల్లో 120 నాటౌట్, 10 సిక్స్‌లు; 9 ఫోర్లు) మెరుప శతకాలతో చెలరేగారు. అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 36, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ వికెట్ నస్టానికి 283 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లూతో ఒక వికెట్‌ తీశాడు. కాగా టీ 20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కాగా.. ఓవరాల్‌గా రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు ఇది భారత్‌కు ఓవర్సీస్‌లో అత్యధిక స్కోరు. అలాగే టీమ్ ఇండియా తరఫున సంజూ శాంసన్, తిలక్ వర్మ ఇద్దరూ ఏ వికెట్‌కైనా రికార్డు మరియు అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ 93 బంతుల్లోనే 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

కాగా  ఈ కీలక మ్యాచ్ లో ప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ టీమ్ ఇండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ పవర్‌ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశారు. కానీ ఆరో ఓవర్ ఆరో బంతికి అభిషేక్ శర్మ ఔటవడంతో ఈ జోడీ విడిపోయింది.  అభిషేక్ శర్మ 18 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 36 పరుగులు చేసి  వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బరిలోకి దిగిన తిలక్ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇద్దరూ కలిసి పోటీ పడి మరీ ఫోర్లు, సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు ఢీలా పడిపోయారు.

ఇవి కూడా చదవండి

సెంచరీల మోత మోగించిన సంజూ, తిలక్..

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్,  వరుణ్ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్: ఐడాన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రెజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్ మరియు లూథో సిపామల.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్