Simon Katich Controversial Statement on Virat Kohli: భారత క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పర్యటన గుర్తుండిపోయేది కాదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. ఇది కాకుండా మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 340 పరుగుల ఛేదనలో ఉన్నప్పుడు కూడా అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ సైమన్ కటిచ్, విరాట్ కోహ్లీపై ఓ వివాదాస్పద ప్రకటన చేశాడు. ‘కింగ్ ఇక లేరు’ అంటూ బాంబ్ పేల్చాడు.
ఐపీఎల్‌లో విరాట్, కటిచ్ జోడీ కలిసి కనిపించింది. సైమన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అయితే, ఇప్పుడు సైమన్ కటిచ్, విరాట్ కోహ్లీపై ఓ వివాదాస్పద ప్రకటన ఇవ్వడంతో పాటు, భారత దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ప్రశంసించాడు. బుమ్రా ఇప్పుడు విరాట్ ‘కింగ్’ బిరుదుకు అర్హుడు కాదంటూ స్పష్టం చేశాడు. విరాట్ ఔటైన తర్వాత ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్‌లో కూర్చున్న కటిచ్, ‘ది కింగ్ ఈజ్ నో మోర్ అంటూ విమర్శించాడు. ఈ క్రమంలో కింగ్‌గా బుమ్రా బాధ్యతలు స్వీకరించాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతను భారీ ఇన్నింగ్స్ ఆడవలసి ఉంది. కానీ, అతను అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఆస్ట్రేలియా జట్టు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు బుమ్రా క్రికెట్‌లో ‘కింగ్’ హోదాను పొందుతున్నాడని సైమన్ సూటిగా చెప్పుకొచ్చాడు. మెల్‌బోర్న్ టెస్టు నాలుగో రోజు, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్‌ను బుమ్రా అవుట్ చేశాడు. కటిచ్ బుమ్రాను ‘కింగ్’ అని పిలిచాడు. హెడ్ వికెట్ పడినప్పుడు, ‘ఇది పర్ ఫెక్షన్, కింగ్ బుమ్రా. ‘ట్రావిస్ హెడ్‌కి బాక్సింగ్ డే పీడకల కొనసాగుతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆధిపత్యం చెలాయించాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 30 వికెట్లు తీశాడు. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్ట్ బౌలర్. 71 వికెట్లతో ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. మరోవైపు, కోహ్లీ గురించి చెప్పాలంటే, ఈ సిరీస్‌లో అతను ఒకే ఒక్క సెంచరీ చేశాడు. అంతే కాకుండా దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. 4 మ్యాచ్‌లు ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాటింగ్‌లో 167 పరుగులు మాత్రమే వచ్చాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..