IND vs AUS 1st ODI: షమీ పాంచ్ పటాకా.. మెరిసిన వార్నర్.. మొహాలీ వన్డేలో టీమిండియా టార్గెట్ ఎంతంటే?
మొహాలీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జోష్ ఇంగ్లిష్ (45), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబుషేన్ (39) ఓ మోస్తరుగా రాణించారు.
మొహాలీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జోష్ ఇంగ్లిష్ (45), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబుషేన్ (39) ఓ మోస్తరుగా రాణించారు. ఓపెనర్ మిషెల్ మార్ష్ (4), గ్రీన్ (31), మార్కస్ స్టొయినిస్ (29), కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (21), షార్ట్ (2) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మెరిశాడు. బుమ్రా, రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సమష్ఠిగా రాణించారు. అయితే ఫీల్డర్లు పూర్తిగా నిరాశపర్చారు. చేతికొచ్చిన సులభమైన క్యాచులను జారవిడిచారు. ఇక కీపింగ్‌లో కెప్టెన్ రాహుల్ అయితే దారుణంగా నిరాశపర్చాడు. క్యాచులు జారవిడవడంతో పాటు రనౌట్లను కూడా మిస్ చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా సులభమైన క్యాచ్‌లు నేలపాలు చేశాడు. ఇక షమీ (5/51), బుమ్రా (1/43), అశ్విన్ (1/47), రవీంద్ర జడేజా (1/51) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా శార్ధూల్ ఠాకూర్ (78/0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ తీసుకుంది. 4 పరుగుల వద్దే డ్యాషింగ్ ఓపెనర్ మిచెల్ మార్ష్(4) వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం ఇచ్చాడుషమీ. అయితే ఆ తర్వాత వచ్చిన స్మిత్(41), మరో ఓపెనర్ వార్నర్(52) దూకుడుగా ఆడారు. రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా స్మిత్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ లబూషేన్(39), గ్రీన్ (30) ఆదుకున్నారు. ఆఖర్లో గ్రీన్ కూడా ధాటిగా ఆడి ఆసీస్ స్కోర్‌ను 250 దాటించారు.
ఐదు వికెట్లతో రాణించిన షమీ..
View this post on Instagram
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషెన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా
భారత జట్టు: శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..