అదే జరిగితే.. మళ్లీ దాయాదుల పోరు పక్కా.. కానీ ఈసారి కెప్టెన్‌గా రోహిత్ కాదు..
మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ జట్లు రెండుసార్లు తలబడగా.. ఒకటి వర్షంతో రద్దు కాగా.. రెండోదానిలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలబడనున్నాయి. అయితే ఈసారి తలబడేది..
మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ జట్లు రెండుసార్లు తలబడగా.. ఒకటి వర్షంతో రద్దు కాగా.. రెండోదానిలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలబడనున్నాయి. అయితే ఈసారి తలబడేది మెన్స్ జట్లు కాదండోయ్. ఉమెన్స్ జట్లు. మీరు వినేది కరెక్టే..! అదేంటో తెలియాలంటే.. పదండి మరి స్టోరీ చూసేద్దాం..
చైనా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్ 2023లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్లు టోర్నీ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ నాలుగు జట్లు సెప్టెంబర్ 24 అనగా ఆదివారం బంగ్లాదేశ్-భారత్, శ్రీలంక పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై భారత్, పాకిస్తాన్ ఉమెన్స్ జట్లు గెలిస్తే.. దాయాదులైన భారత్, పాక్ మరోసారి ముఖాముఖి తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లు సెప్టెంబర్ 25న ఫైనల్‌లో ఆడుతాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బంగారు పతకం, ఓడిన జట్టు రజతం సొంతం చేసుకుంటాయి. ఇక సెమీస్‌లో ఓడిన జట్లు కాంస్యం కోసం అదే రోజు పోటీ పడనున్నాయి.
మరోవైపు ఆసియా గేమ్స్ క్రికెట్ మెన్స్ టీ20లో భారత్ మెన్స్ టీం క్వార్టర్ ఫైనల్‌లో గ్రూప్ స్టేజిలో గెలిచిన జట్టుతో అక్టోబర్ 3న తలబడనుంది. ఇక భారత మెన్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఆసియా క్రీడలు 2023 భారత పురుషుల క్రికెట్ జట్టు ఇదే..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్
స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
ఆసియా క్రీడలు 2023 భారత మహిళల క్రికెట్ జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), అమంజోత్ కౌర్, దేవిక వైద్య, పూజా వస్త్రాకర్, టిటాస్ సాధు, రాజేశ్వరి గయాక్వాడ్, మినును గయాక్వాడ్ మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్-కీపర్), అనూషా బారెడ్డి
స్టాండ్‌బై ప్లేయర్స్: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్