Video: స్టన్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. బద్దలైన అనిల్ కుంబ్టే రికార్డ్.. తొలి ప్లేయర్‌గా రన్నింగ్ మెషీన్..
India vs Australia, 5th Match, Virat Kohli Stunning Catch: ఈ క్యాచ్‌తో టీమిండియా శిబిరంలో ఆనందాలు వెల్లువెత్తాయి. అయితే, ఇదే క్రమంలో ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మొత్తం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో 15 క్యాచ్‌లు పట్టి, కుంబ్లే రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

Virat Kohli Stunning Catch: నేడు అంటే అక్టోబర్ 8, ఆదివారం చెపాక్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ 2023లో తలపడుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు. అందుకుగల కారణం కూడా ఉంది. టాస్ గెలిచిన ఆనందంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు బుమ్రా ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ బ్యాట్ వెలుపలి అంచుని తాకిన బంతి స్లిప్‌లో ఉన్న కోమ్లీ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో అద్భుతంగా డైవ్ చేసిన కోహ్లీ పల్టీలు కొడుతూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్ అవడం ఆస్ట్రేలియా ఆటగాళ్ల వతైంది. స్టన్నింగ్ క్యాచ్‌తో మిచెల్ మార్ష్ పెవిలియన్ వైపు కదిలాడు.
ఈ క్యాచ్‌తో టీమిండియా శిబిరంలో ఆనందాలు వెల్లువెత్తాయి. అయితే, ఇదే క్రమంలో ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మొత్తం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో 15 క్యాచ్‌లు పట్టి, కుంబ్లే రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.




View this post on Instagram
| ప్లేయర్ | మ్యాచ్‌లు | క్యాచ్‌లు |
| విరాట్ కోహ్లీ | 27 | 15 |
| అనిల్ కుంబ్లే | 18 | 14 |
| కపిల్ దేవ్ | 26 | 12 |
| సచిన్ టెండూల్కర్ | 45 | 12 |
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




