Team India: టీమిండియా కొంపముంచిన ఆ మూడు.. కట్‌చేస్తే.. 10 ఏళ్ల తర్వాత ఘోర పరాజయం..
Indian Team Lost the Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని దక్కించుకుంది. ఈ సిరీస్ ఓటమిలో భారత జట్టు ఎన్నో తప్పదాలు చేసింది. దీంతో ట్రోఫీని కోల్పోవడమే కాక, ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి దూరమైంది. అలాగే, రోహిత్, కోహ్లీల చివరి సిరీస్ ఓటమితో ముగించాల్సి వచ్చింది.
Indian Team Lost the Border-Gavaskar Trophy: సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఓటమితో టీమిండియా 1-3తో సిరీస్‌ను కోల్పోయింది. భారత్ తన పర్యటనను అద్భుతంగా ప్రారంభించింది. పెర్త్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత నుంచి భారత జట్టు నిరంతర పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ విధంగా 10 ఏళ్ల తర్వాత భారత్‌పై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. భారత జట్టు ఈ సిరీస్‌లో ఎన్నో తప్పులు చేసింది. దీంతో ఈ సిరీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అందులో టీమిండియా చేసిన 3 కీలక తప్పిదాల వల్ల అవమానకరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
3. రోహిత్ శర్మ పేలవమైన కెప్టెన్సీ..
ఈ సిరీస్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ చాలా పేలవంగా సారథ్యం వహించాడు. అతను కొన్ని సమయాల్లో చాలా డిఫెన్సివ్ ఫీల్డ్‌ని సెట్ చేశాడు. అతని బౌలింగ్ మార్పులు కూడా అంత బాగా లేవు. ఈ కారణంగా, ఆస్ట్రేలియా టెయిల్ బ్యాట్స్‌మెన్స్ కూడా భారత్‌పై చాలా పరుగులు చేశారు. వారు మ్యాచ్‌లో పునరాగమనం చేశారు.
2. సీనియర్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో విఫలం..
ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్స్ భారత్ తరపున పేలవ ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏమాత్రం బ్యాటింగ్ చేయడంలో ఆసక్తి చూపలేదు. రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఈ కారణంగా రోహిత్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ నుంచి వైదొలగవలసి వచ్చింది. కాగా, విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేసిన తర్వాత పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోయాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ లేకపోవడం టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొంది. కేఎల్ రాహుల్ కూడా అంతగా రాణించలేకపోయాడు.
1. జస్ప్రీత్ బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి మద్దతు లభించలేదు..
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఈ కారణంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే, ఇతర బౌలర్ల నుంచి బుమ్రాకు ఎలాంటి సహకారం లభించలేదు. సిరాజ్ సహా ఇతర బౌలర్లు ఇందులో సగం అయినా చేసి ఉంటే బహుశా టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో ఉండేదేమో.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..