IND vs AFG: మరికొన్ని గంటల్లో ఇండియా- ఆఫ్గనిస్తాన్‌ మొదటి టీ20 మ్యాచ్‌.. కోహ్లీ ప్లేస్‌లో ఆడేది ఎవరంటే?

జనవరి 11న కోహ్లీ కూతురు వామిక పుట్టినరోజు. అందుకే కుటుంబ సమేతంగా కూతురి బర్త్‌ డే వేడుక జరుపుకోవాలని భావించి విరాట్ తొలి టీ20 మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  మరి అతని ప్లేస్‌లో ఎవరాడుతారో క్లారిటీ రావడం లేదు. మ్యాచ్‌కు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్

IND vs AFG: మరికొన్ని గంటల్లో ఇండియా- ఆఫ్గనిస్తాన్‌ మొదటి టీ20 మ్యాచ్‌.. కోహ్లీ ప్లేస్‌లో ఆడేది ఎవరంటే?
India Vs Afghanistan
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2024 | 3:07 PM

సుమారు 14 నెలల తర్వాత కింగ్ కోహ్లీని టీ20 ఫార్మాట్‌లో చూడాలని ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు షాక్ తగిలింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఏర్పాటు చేసిన భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ మొదటి మ్యాచ్‌లో ఆడడం లేదని స్పష్టం చేశాడు. అయితే విరాట్‌ ఆడకపోవడానికి స్పష్టమైన కారణం చెప్పలేదు ద్రవిడ్‌. అయితే జనవరి 11న కోహ్లీ కూతురు వామిక పుట్టినరోజు. అందుకే కుటుంబ సమేతంగా కూతురి బర్త్‌ డే వేడుక జరుపుకోవాలని భావించి విరాట్ తొలి టీ20 మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  మరి అతని ప్లేస్‌లో ఎవరాడుతారో క్లారిటీ రావడం లేదు. మ్యాచ్‌కు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఆడకపోతే మూడో నంబర్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఆడించే అవకాశం ఉంది. పైగా శుభ్‌మన్ గిల్ లోకల్‌ కావడంతో అతనికి పక్కాగా జట్టులో అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఇక సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావచ్చు. జితేష్ శర్మ కూడా జట్టులో ఉన్నప్పటికీ సంజూ శాంసన్‌కు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల, అతను దక్షిణాఫ్రికాపై మూడో నంబర్‌లో బ్యాటింగ్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. అంటే ఫామ్‌లో ఉన్న సంజుకు తొలి టీ20 మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు.

కుల్‌ దీప్‌ ఔట్‌..

హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో శివమ్ దూబేకి జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది కాబట్టి దూబేకు ప్లేస్‌ ఖరారు కావొచ్చు. రింకూ సింగ్ కూడా ఆడటం దాదాపు ఖాయం. ఇక జట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఇద్దరూ బౌలింగ్‌ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. అందుకే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

జట్టులో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తే మాత్రం కచ్చితంగా రవి బిష్ణోయ్‌ వైపే టీమ్ మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బిష్ణోయ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. అదే సమయంలో ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ పేస్ త్రయం ఆడటం దాదాపు ఖాయం.

మొహాలీలో భారత జట్టు..

తొలి మ్యాచ్‌కి భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..